24, నవంబర్ 2011, గురువారం

గరళకంఠుని వర్ణించు వికటకవి పద్యం గానార్ణవుడైన ఘంటసాల గళంలో

ఈ కార్తీక మాసంలో పరమ శివుని పై ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు ముందు పోస్టులలో పొందు పరచాను. అయితే కార్తీక మాసము పూర్తి అయ్యే లోగా ఏదైనా చిన్న శ్లోకమో, పద్యమో ప్రస్తుతిద్దా మనుకునేసరికి అనుకోకుండా తెనాలి రామకృష్ణ (1956) చిత్రంలోని ఒక సన్నివేశంలోని శ్లోకం శివునికి సంబంధించినదని అంతర్జాలంలో కొంచెం శోధించాక తెలిసింది. బహుశ ఇది చాలమందికి తెలుసనుకుంటాను. నాకు ఇపుడే తెలిసింది. ఇక ఉండబట్టలేక ఈ పోస్టు వ్రాస్తున్నాను. దేవి వరప్రసాదం వలన రామకృష్ణుడు వికటకవియై, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో చేరి, తన చతురతతో, సమయస్ఫూర్తితో, అందరినీ ఆనందింపజేసేవాడు. తెనాలి రామకృష్ణునితో కలసి మొత్తం ఎనిమిది మంది కవులు (అష్ట దిగ్గజములు) గల సభను భువనవిజయము అని కూడ అంటారు. ఒక రోజు భువన విజయానికి 'సహస్ర ఘంటకవి' అని బిరుదుగల ప్రెగడ నరసరాజు కవి వచ్చి, తాను "పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తానని, పరుల కవిత్వలో తప్పులు పడతానని", తన ప్రతిభను గౌరవించి జయపత్రిక ఇవ్వమని రాయలవారిని  అడుగుతాడు. 
 

రాయల అనుమతి మీదట ముందుగా అల్లసాని పెద్దన అందుకుని 

మరుధృతాతటస్థ శత్రుమండలీగళాంతర
శ్చరన్నరాత్రు కాపగాభి సారికా ధృతాంబుధీ
మరుత్పతిత్ మరుజ్ఝతి క్రమత్పృట కుభుత్వరత్
పృరర్ధరిత్ ప్రవృధయుద్ధ పుంఖితార కార్భటీ
(విని వ్రాసాను. తప్పులు దొర్లి వుంటే తెలుపగలరు) అనే పద్యం చెబుతాడు. దానిని వ్రాసానని నరసరాజు చెప్పడంతో, ఎలాగైనా ఈ కవి గర్వం అణచాలని నిశ్చయించుకుని తెనాలి రామకృష్ణుడు ఈ దిగువ గల పద్యం వ్రాయమంటాడు -
శివుని వర్ణన 
                            త్పృవ్వటబాబా తలపై
                            పువ్వట జాబిల్లి, వల్వ బూదట, చేదే
                            బువ్వట, చూడగను ళుళు
                            క్కవ్వట, నరయంగ నట్టి హరునకు జేజే !!

ఈ పద్యం ఎలా ప్రారంభించాలో మొదట్లోనే ఇబ్బంది పడిన నరసరాజు ఘంటం ఆగిపోతుంది. అపుడు రామకృష్ణుడు మందలింపుగా ఇలా తిడతాడు. 

                     తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
                     పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
                     పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
                     రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!

అపుడు రాయల వారు రామకృష్ణుని శాంతించమని నరసరాజ కవికి కావలసినంత ధనం ఇప్పించి పంపించేస్తాడు. తరువాత అదే పద్యాన్ని రాయల వారు తన భార్య తిరుమల దేవికి చెప్పగా, ఆమె చిత్ర రూపంలో ఆ పద్యాన్ని వ్రాసి చూపించి రాయల వారి కానుక గ్రహిస్తుంది.

ఈ శ్లోకంలో "అట" అనే శబ్దం పలుమార్లు వస్తుంది. త్పృవ్వ* = ఎద్దు (పశువుల కాపరులు ఆవులు కాస్తూ పెదవులతో చేసే ధ్వని ఇది. అలాగే తువ్వాయి కి అర్ధం "దూడ" అని; బాబా = వాహనము (ఇది బహుశా ఆవుగాని ఎద్దుగాని అంబా..అంబా. అని అరుస్తాయి. అందులోనుంచి పుట్టిన ధ్వని కావచ్చు; *నా చిరకాల మిత్రులు శ్రీ అహోబిల మురళి గారు హ్యుస్తను,టెక్సాస్ నుండి ఫోనుచేసి సూచించారు. త్ప్రువ్వత అనే పదం రాయల సీమలో వాడుకలో ఉండే పదం. దానికి అర్ధం నీరు అని. త్ప్రువ్ = నీరు; బాబా = శివుడు; తలపై నీరు (గంగ) కలవాడు = గంగాధరుడు లేదా శివుడు.  వల్వ = వస్త్రము; బూది = విభూది లేక విభూతి లేక బూడిద; చేదే = చేదుగా ఉండెడిది (విషం); బువ్వ = ఆహారము; ళుళుక్కవ్వ  = ఉండకపోవటం; (ఉదా.హుళక్కి); అరయంగనట్టి = అటుల వెలుగొందు;  హరుడు = శివుడు; జేజే = విజయము. 

తాత్పర్యం: తలపై గంగ ధరించిన వాడట. తల మీద చంద్రుడు పువ్వువలె ఉన్నాడట. విభూతే వస్త్రమట. చేదైనది (విషం) భోజనమట. దిక్కులేని వాడట. అట్టి పరమశివునికి జేజేలు.

గమనిక: ఈ వివరణ నా స్వంతం కాదు. ఆసక్తితో అంతర్జాలంలో శోధించగా ఒక బ్లాగులో దొరికింది నాకు.  దానికి నా ఊహను జోడించి పైన వివరించాను. ఈ శ్లోకం యొక్క అర్ధం వివరించబడిన బ్లాగు లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయితే మన తెలుగు మనం మరచి పోతున్న ఈ రోజులలో ఇలాంటి వివరణలు లభిస్తే పద్యాలను ఇంకెంతో ఆస్వాదించ వచ్చును. ఔత్సాహికులయిన తెలుగు ఆచార్యులు ఈ పనికి పూనుకుంటే చాల బాగుంటుంది.

7 కామెంట్‌లు:

  1. తెలుగు భాషలో సందర్భానుసారంగా కొన్ని పదాల అర్థాలు మారుతుంటాయి. ఈ పోస్టులోని త్ప్రువ్వట బాబా పద్యంలో మొదటి వాక్యానికి గల అర్ధాన్ని వివరించిన మిత్రులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళిగారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. ee padyaalu vintunte ento haayigaa undi. malli malli vinaalanipistunnaadi. meeku dhanyavaadaalu

    రిప్లయితొలగించండి
  3. cinema madhyamam dwara panditulane kadu pamarulanu kooda rasagnuluga, kavita poshakuluga, abhiruchini penchi vaarilo kooda grandhika kavitwamu meeda aasakti, pandityamu patla abhiruchi, abhimanamu penchavachchani niroopinchina itivruttalu koorchabadina aa rojula lone kavulaku, sahitimoortulaku satakoti vandanalu -rao

    రిప్లయితొలగించండి
  4. సూర్యనారాయణ గారు "భువన విజయం" నాటకం చార్లెట్ లో ఏప్రిల్ 27 వ తేదీన వేస్తున్నారండి. మీకు ఆసక్తి ఉంటే తెలుగు అసోసియేషన్ సభ్యులను ఎవరినైనా సంప్రదించండి.

    రిప్లయితొలగించండి
  5. Sunil gariki, abhivandanalu mariyu abhinandanalu. mee sahithi seva goppaga undi.

    రిప్లయితొలగించండి
  6. ఇప్పటి వరకు రామకృష్ణకవి చెప్పిన పద్యానికి అర్ధం తెలియకుండానే ఆనందించాం.
    తెలిపి మరింత సంతోషపెట్టిన మీకు శతవందనాలు.

    రిప్లయితొలగించండి
  7. మరుద్వృధా తటస్థ శత్రు మండలీ గళాంతర
    క్షరన్నవాసృగాపగాభిసారికాదృతాంబుధీ
    మరుత్పతిస్వరుక్షతిక్రమత్రుటత్కుభృద్వర
    స్ఫురద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ

    మరుద్వృధా = కావేరీ నది యొక్క (మరుత్ = గాలుల చేత, వృధా = వృద్ధి గలది)
    తటస్థ = తీరమునందున్న
    శత్రు మండలీ = శత్రు సమూహముల యొక్క
    గళాంతర = గొంతుకల మధ్య నుండి
    క్షరత్ = జారుచున్న
    నవాసృగాపగా = క్రొన్నెత్తురు టేరులనెడు
    అభిసారికా = అభిసారిక స్త్రీల చేత
    అదృత = సంతోషపరుపబడిన
    అంబుధీ = సముద్రము కల వాడా

    అనగా కృష్ణరాయలు కావేరీ తీర ప్రాంతములందలి శత్రు రాజులను జంపి వారి నెత్తురు లేరులుగా ప్రవహించి సముద్రము వరకు పారునట్లు చేసెననియు, నవి చూడ నా నెత్తురుటేరు లభిసారికల వలెను నవి సముద్రము వరకు బోవుట అభిసారికలు ప్రియుని గూర్చి చనునట్లు నుండెననియు భావము.

    మరుత్పతి = ఇంద్రుని యొక్క
    స్వరు = వజ్రాయుధము యొక్క
    క్షతిక్రమ = ఏటుల వరుస చేత
    త్రుటత్ = పగిలిన
    కుభృద్వర = పర్వత శ్రేష్ఠముల వలె
    స్ఫురత్ = అధికమగు
    ధ్వని = శబ్దముల చేత
    ప్రవృద్ధ = అతిశయించుచున్న
    యుద్ధ = యుద్ధమునందలి
    పుంఖిత = గుంపులగు
    ఆనక = భేరుల యొక్క
    ఆర్భటీ = మ్రోత గల వాడా

    అనగా కృష్ణరాయలు యుద్ధము నందు తీసికొని పోవు భేరుల మ్రోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతిచే కూలు పర్వత ధ్వనుల వలె నొప్పెనాని భావము.

    (సేకరణ - తిమ్మనార్య కృత పారిజాతాపహారణ కావ్యమునకు శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారి వ్యాఖ్యానము నుండి)

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)