1954 సంవత్సరంలో విడుదలైన విజయా వారి సంస్థ నిర్మించిన చంద్రహారం చిత్రం నుండి ఘంటసాల రాణి, పద్మావతి, బృందం తో పాడిన "ఆంగికం భువనం - జయజయవిజయేంద్ర" అనే ఈ బృందగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, శ్రీరంజని. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు. దీనిని ఆర్.నాగేశ్వరరావు, తదితరులు పై చిత్రీకరించారు.
చంద్ర హారం చిత్రం అంత విజయవంతం కాక పోయినా ఇందులో ఘంటసాల గారు పాడిన చక్కని యుగళ గీతాలు, ప్రార్థన, సోలోలు ఉన్నాయి. ఇందులో "ఆంగికం భువనం యస్య" అనే శివ శ్లోకాన్ని నటరాజు అయిన శివునికి ప్రణమిల్లుతూ నాట్యాభ్యాసం చేసే విద్యార్థులు ముందుగా పాడి పరమ శివునికి కైమోడ్పులు ఒసగుతారు. ఈ శ్లోకం తరవాత వచ్చే పాటను శ్రీ పింగళి నాగేంద్ర రావు గారు రచించారు.కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి