చిత్రం: చంద్రహారం (1954)
రచన: పింగళి నాగేంద్ర రావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
ప. యేనాడు మొదలిడితివో ఓ! విధీ
యేనాటికయ్యెనీ నాటక సమాప్తి
చ. జనన మరణాలతో సుఖదుఃఖములతో | జనన |
ప్రాణులను ఆడించి పీడింతువేమయ్య | ప్రాణులను |
ఎన్నెన్నొ వేడుకల యీ సృష్టి కల్పించి | ఎన్నెన్నొ |
కనుమూయునంతలో మాయజేసేవయ్య
యేనాడు మొదలిడితివో ఓ! విధీ
యేనాటికయ్యెనీ నాటక సమాప్తి
చ. నేను నాదను ఆశ గగనాని కెక్కించి | నేను నాదను |
అంతలో పాతాళమున దింతువేమయ్య | అంతలో |
తనువు శాశ్వతమంచు మైమరువ జేసి | తనువు |
తనువునూ, జీవినీ విడదీతువేమయ్య
యేనాడు మొదలిడితివో ఓ! విధీ
యేనాటికయ్యెనీ నాటక సమాప్తి
యేనాటికయ్యెనీ నాటక సమాప్తి
One of the rare song, we heard. Good job done.Thanks. Kasi rao
రిప్లయితొలగించండికాశీరావు గారికి, ధన్యవాదాలు. నిజంగా అరుదైన ఆణిముత్యం. నేనీమధ్యనే విన్నాను. మీకు నచ్చినందుకు సంతోషం.
రిప్లయితొలగించండిశ్రీ Suryanarayana Vulimiri గారి అభిరుచి బహుదా శ్లాఘనీయం వారికివే నా అభినందన చందనాలు ..
రిప్లయితొలగించండిధన్యవాదములు మరియు నమస్కారములు శ్రీ శ్రీనివాస మూర్తి గారు.
తొలగించండి