చిత్రం: గృహప్రవేశం (1946)
పాట: మారుతుందోయ్ ధర్మము
గానం: ఘంటసాల
సంగీతం: నళినీకాంత్
రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
1946 లో విడుదలైన చిత్రం ఇంకా చూడటానికి దొరుకుతున్నదీ అంటే అది అంతర్జాల మహిమ. ఈ చిత్రంలో భానుమతి, ఎల్.వి. ప్రసాద్ లు నాయికా నాయకులుగా నటించారు. సంఘ సంస్కరణల పై తీసిన చిత్రం ఇది. సవతి తల్లి బలవంతంగా నచ్చని వాడితో పెళ్లి జరపడానికి సిద్ధపడితే తన తల్లి చెప్పిన "మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఫలితం ఏమైనా సరే" మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఇల్లు వదలి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆఖరులో తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కధానాయిక. ఇందులో హీరో ఎల్.వి. ప్రసాద్ (అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు) కాగా, ఊహించలేని పాత్రలో భానుమతి వెంటపడి పెళ్లి చేసుకోమని అల్లరి చేసే తుంటరి సి.ఎస్.ఆర్. ఇందులో ఘంటసాల మాస్టారు పాడినది ఒకటే పాట. అది ఒక బైరాగి పాడతాడు. ఎప్పటికైనా సమాజం మారుతుందనే ఆశాభావంతో "మారుతున్దోయ్ ధర్మమూ" అనే పాటను శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు వ్రాసారు. సంగీతం "నళినీ కాంత్" అని సూచించ బడినా అది కూడా వారి మారు పేరే. ఈ సినిమాను క్రింది లింకులో వీక్షించ వచ్చును.
ప. మారుతుందోయ్ ధర్మము
మారుతుందోయ్ ధర్మము
చ. యుగ యుగమ్ముల లోక వర్తన తగిన రీతిని మారుతుంటే
యుగ యుగమ్ముల లోక వర్తన తగిన రీతిని మారుతుంటే
నీవు నేను సంఘమైతే నియమముగ ఒక సమ్మతైతే
నీవు నేను సంఘమైతే నియమముగ ఒక సమ్మతైతే
మారుతుందోయ్ ధర్మము
చ. కళ్ళు తెరవని నాడె బాలల పెళ్ళియని శాసించు ధర్మం
కళ్ళు తెరవని నాడె బాలల పెళ్ళియని శాసించు ధర్మం
భర్తనెరుగని బాల విధవకు పెళ్ళి తగదను క్రూర ధర్మం
భర్తనెరుగని బాల విధవకు పెళ్ళి తగదను క్రూర ధర్మం
మారుతుందోయ్ ధర్మము
మారుతుందోయ్ ధర్మము
ఇందులోనే 'హాలాహలమెగయునో,అమృతాంబువులె కురియునో 'అన్న పాట కూడా ఘంటసాలవారు పాడినట్లు గుర్తు.
రిప్లయితొలగించండికమనీయం గారికి, నమస్కారములు. ఈ చిత్రంలోని "హాలాహలమెగయునో" అన్న పాట ఎం.ఎస్.రామారావు గారు, భానుమతి గారు పాడారు. మొత్తం 11 పాటలున్నాయి. ఎక్కువభాగం భానుమతి గారి సోలో సాంగ్స్. ఘంటసాల మాష్టారు, సి.ఎస్.ఆర్. గారు, కన్నాంబ గారు చెరొకటి పాడారు. ఈ సమాచారం ఈ వెబ్ సైట్లో ఇవ్వబడింది. http://www.sakhiyaa.com/grihapravesam-1946-గృహప్రవేశం-2/ అయితే ఇది నేను పుట్టడానికి ఒక తరం ముందు వచ్చిన సినిమా. నేను ఈ మధ్యనే చూడటం తటస్థించింది. ప్రోజక్టు ఘంటసాల వారి వెబ్ సైట్లో కూడ ఒక్క పాటే నమోదు అయి వుంది. మాశ్టారు మరొక పాట కూడ పాడారో ఏమో నా అనుభవానికి అందనిది. మీ ఆసక్తికి, నా బ్లాగు దర్శించినందుకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి