"భీమాంజనేయ యుద్ధం" చిత్రానికి ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తినార్జించిన ఇరువురు వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్లు, శ్రీ దండమూడి రాజగోపాల రావు గారు భీమునిగా, శ్రీ కామినేని ఈశ్వర రావు గారు ఆంజనేయునిగా పోటా పోటీగా నటించిన చిత్రమిది. ఈ ఇద్దరు మహామహులు కృష్ణా జిల్లాకు చెందినవారు. దండమూడి రాజగోపాల్ "నర్తనశాల" చిత్రంలో భీమునిగా అందరికి చిరపరిచితులు. ఈ చిత్రం లో ముఖ్య తారాగణం కాంతారావు, రాజశ్రీ. ఘంటసాల మాస్టారు కొన్ని పాటలు, పద్యాలు ఈ చిత్రానికి పాడారు.
చిత్రం: భీమాంజనేయయుద్ధం (1966)
గానం: ఘంటసాల
సంగీతం: టి.వి.రాజు
రచన:
సాకీ. సురభామినీ..
సౌదామినీ..
ప. సురభామినీ సౌదామినీ
కలహంస వోలె ఇటు రావే
తెలి నవ్వు వెన్నెలలు తేవే
సురభామినీ.. సౌదామినీ
కలహంస వోలె ఇటు రావే
తెలి నవ్వు వెన్నెలలు తేవే
చ. సెలయేరులలో జలధారలలో నీ కులుకులేవొ కనిపించె (2)
చిగురాకులలో పువురేకులలో నీ సొగసులేవొ తోచే
ఏమందు నేను నాముందు నేడు నవనందనాలు నిలిచె
సురభామినీ..
సౌదామినీ..
సురభామినీ సౌదామినీ
కలహంస వోలె ఇటు రావే
తెలి నవ్వు వెన్నెలలు తేవే
చ. నే తుమ్మెదనై మధురమ్ముగ నీ గానమ్ము చేతు జవరాలా
ఆ..ఆ..ఆ..ఆ
నే తుమ్మెదనై మధురమ్ముగ నీ గానమ్ము చేతు జవరాలా
నే తెమ్మెరనై లలితమ్ముగ నీ నయనమ్ములంటెదను బాలా
ఏ నాటికైన నీ బాటలోన పయనింతు లెమ్ము చెలియ
సురభామినీ సౌదామినీ
కలహంస వోలె ఇటు రావే
తెలి నవ్వు వెన్నెలలు తేవే
కృతజ్ఞతలు: వీడియో మరియు సినిమా పోస్టరు శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారి సౌజన్యంతో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి