తెలుగు సినీ రంగంలో తొలుదొలుత విడుదలైన జానపద చిత్రాలలో నాయిక పరంగా విజయం సాధించిన చిత్రాలలో 1949 లో విడుదలైన వాహినీ వారి "గుణసుందరి కథ" ఒకటి. ఇందులో శ్రీరంజని టైటిల్ పాత్రలో నటించింది. ఒకరాజుకు (గోవిందరాజుల సుబ్బారావు) ముగ్గురు కూతుర్లున్నారు. హేమసుందరి (మాలతి), రూప సుందరి (శాంత కుమారి), గుణ సుందరి (శ్రీ రంజని). పాత్రల పేర్లను బట్టి, గుణం అన్నిటికన్నా గొప్పదని చెప్పే నీతికి రూపం దిద్దిన వృత్తాంతం ఈ చిత్రం. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన " అమ్మా మహాలక్ష్మీ దయచేయవమ్మా" చాల చక్కని పాట. ఈ చిత్రంలోశ్రీమతి పి.లీల పాడిన "అమ్మా తులసమ్మా" అనే పాట ఆ రోజుల్లో ఇంటింటా ఆడవాళ్ళు ఎక్కువగా పాడుకునే భక్తి పాట అని అంటారు.
చిత్రం: గుణసుందరి కథ (1949)
రచన: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
ప. అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా | అమ్మా |
మమ్ము మా పల్లె పాలింపవమ్మా |మమ్ము|
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
చ. ఎన్ని నోముల పంటవొ అమ్మా |ఎన్ని నోముల|
ఏమి పుణ్యాల ఫలమవు అమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
నీవు పట్టింది బంగారమమ్మా
నీవు మెట్టింది స్వర్గమె అమ్మా |నీవు మెట్టింది|
నీవు పలికింది నిజ ధర్మమమ్మా |నీవు పలికింది|
నీవు మా భాగ్య దేవతవే అమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
చ. ఎరుకలు జీవజనులను మరువ వలదమ్మా
పరువున రాచవారిని తీసిపోమమ్మా |పరువున|
నిను కన్నబిడ్డగ చూచునే అమ్మా |నిను కన్న|
నిను కంటిపాపగ కాచునే అమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
మీ ప్రయత్నం ప్రశంసనీయం !
రిప్లయితొలగించండిసాహిత్యం , స్వరం తో పాటూ దృశ్యం కూడా పొందుపర్చడం ఎంతో బావుంది !
ఒక రాత్రంతా అలా చూస్తూ ,వింటూ ఉంటే కాలమే తెలియకుండా గడచి పోయింది !
మీ కృషికి ధన్యవాదములు !
వసంత కిశోర్ గారు, మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ రండి.
తొలగించండిమీ కృషి అద్భుతం, అనన్యసాధ్యం. తెలుగువారు మీకెంతో ఋణపడివుంటారు.. అభినందనలు మరియు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపై పాటలో జూ.శ్రీరంజని ఎంత ముగ్ధమోహనంగా ఉన్నదో !
సత్యనారాయణ గారు ధన్యవాదాలు. ఇందులో నేను చేసినది చాల స్వల్పం. ఎందరో మాస్టారి వీరాభిమానులు చాల శ్రమకోర్చి సేకరించిన దృశ్య, శ్రవణ, లిఖిత సమాచారాన్ని ఒకదగ్గర చేర్చాను. అంతే. మీ స్పందనకు, అభిమానానికి కృతజ్ఞుడ్ని.
తొలగించండిఆర్యా!
రిప్లయితొలగించండిజపమేమి చేసెనో పద్యం కావాలి