1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "అదిగో నవలోకం " అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #000 | పాట: | అదిగో నవలోకం వెలసే మనకోసం |
|---|---|---|
| నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
| చిత్రం : | వీరాభిమన్యు (1965) | |
| సంగీతం : | కె.వి. మహదేవన్ | |
| గీతరచయిత : | ఆరుద్ర | |
| నేపథ్య గానం : | ఘంటసాల, సుశీల | |
| ప : | సు: | ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అదిగో నవలోకం |
| ఘం: | వెలసే మన కోసం | |
| సు: | అహహహ హాహహాహహా | |
| ఘం: | ఓహొహొహొ హోహొహోహొహొ | |
| ఇ: | ఉహుహుహు హూహుహూహు | |
| సు: | అదిగో నవలోకం వెలసే మనకోసం | |
| ఘం: | అదిగో నవలోకం వెలసే మనకోసం | |
| చ: | ఘం: | నీలినీలి మేఘాల లీనమై |
| సు: | ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై | |
| ఘం: | నీలినీలి మేఘాల లీనమై | |
| సు: | ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై | |
| ఘం: | దూర దూర తీరాలకు సాగుదాం | |
| సు: | సాగి దోరవలపు సీమలో ఆగుదాం | |
| ఘం: | దూర దూర తీరాలకు సాగుదాం | |
| సు: | సాగి దోరవలపు సీమలో ఆగుదాం | |
| ఘం: | ఎచట సుఖముందో | |
| సు: | ఎచట సుధ కలదో | |
| ఇ: | అచటె మనముందామా ఆ ఆ ఆ ఆ | |
| అదిగో నవలోకం వెలసే మనకోసం | ||
| చ: | ఘం: | పారిజాత సుమదళాల పానుపూ |
| సు: | మనకు పరచినాడు చెఱకు వింటి వేలుపూ | |
| ఘం: | పారిజాత సుమదళాల పానుపూ | |
| సు: | మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ | |
| ఘం: | ఫలించె కోటి మురిపాలు ముద్దులు | |
| సు: | మన ప్రణయానికి లేవు సుమా హద్దులు | |
| ఘం: | ఫలించె కోటి మురిపాలు ముద్దులూ | |
| సు: | మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ | |
| ఘం: | ఎచట హృదయాలు | |
| సు: | ఎపుడూ విడిపోవో | |
| ఇ: | అచటె మనముందామా ఆఆఆఆ | |
| అదిగో నవలోకం వెలసే మనకోసం | ||
| అదిగో నవలోకం వెలసే మనకోసం |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి