1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "నీ సఖులన్ సహోదరుల " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #000 | పద్యం: | నీ సఖులన్ సహోదరుల |
|---|---|---|
| నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
| చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
| రచన: | సముద్రాల సీనియర్ | |
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |
| గానం: | ఘంటసాల | |
| నీ సఖులన్ సహోదరుల నిన్ను నిమేషములో వధించి, నే | ||
| నీ సభలో సమాధి యొనరింపగజాలుదు, కానీ మీ తలన్ | ||
| వ్రాసె విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సం | ||
| త్రాసము నాపగా తరమె తప్పదు తప్పదు యుద్ధము | ||
| బంధునాశనమున్ |
శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తాడు. అతనిని దుర్యోధనాదులు భూగర్భ గృహంలోకి పడేట్టు చేస్తారు. శ్రీకృష్ణుడు భూగర్భాన్ని చీల్చుకుని సభలోనికి వచ్చి తన విశ్వరూపం చూపిస్తాడు. ఆ దేవదేవుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. అతడు సంకల్పిస్తే అక్కడే సభలోనే కౌరవులను సంహరించగలడు. కాని పాండవుల చేతిలో కౌరవహననం అన్నది విధి లిఖితమని, అందువలన మిన్నకున్నానని చెబుతాడు,


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి