1959 లో విడుదలైన పౌరాణిక డబ్బింగ్ చిత్రం "గాంధారి గర్వభంగం". ఈ చిత్రానికి మాటలు పాటలు మహాకవి శ్రీశ్రీ వ్రాసారు. సంగీతం పామర్తి, సుధీర్ ఫడ్కే. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు రెండు పాటలు పాడారు. అందులో "పదునాలుగు లోకముల ఎదురేలేదే" అనే పాటకు, 1972 లో విడుదలైన బాల భారతం చిత్రానికి ఆరుద్ర గారు వ్రాసిన, మాస్టారు పాడిన మానవుడే మహనీయుడు పాటకు చాల పోలికలు కనిపిస్తాయి. ఈ సన్నివేశంలో అర్జునుడు బాణాలతో ఆకాశానికి వేసిన (నిర్మించిన) నిచ్చెనపై భీముడు స్వర్గలోకానికి వెళతాడు. శ్రీశ్రీ గారి పాటలో పదాలు వింటే నిర్దిష్టమైన వారి శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఆరుద్ర తానెప్పుడూ శ్రీశ్రీ శిష్యుడిననే చెప్పుకునేవారు కదా! ఈ పాట ఆడియో, సాహిత్యం ఇక్కడ పొందుపరుస్తున్నాను. వీడియో నేరుగా లభ్యం కాలేదు. దీని తరువాతి వీడియో చూడండి.
కృతజ్ఞతలు: ఘంటసాల గళామృతము-తెలుగు పాటల పాలవెల్లి మరియు సాహిత్యంలో సవరణలు సూచించిన శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్ గారికి.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
ఈ పాట గురించి వెదకుతుంటే ఒకే సందర్భం మరియు సన్నివేశం కోసం (భీముని స్వర్గలోక యానం) రెండు చిత్రాలకోసం (గాంధారి గర్వభంగం మరియు బాలభారతము) శ్రీశ్రీ మరియు ఆరుద్ర వ్రాసిన రెండు పాటలను ఒక చిత్రానికి ఇంకొక చిత్రపు పాటను super impose చేసి టి.కె.వేణుగోపాల్ రూపొందించారు. వారికి ధన్యవాదాలు. ఈ దిగువ వీడియోలో గాంధారి గర్వభంగం లోని వీడియో కూడ చూడగలరు. అంటే బాలభారతం చిత్రదృశ్యానికి పదునాలుగు లోకముల మరియు గాంధారి గర్వభంగం చిత్రదృశ్యానికి మానవుడే మహనీయుడు గీతాన్ని.
చిత్రం: | గాంధారి గర్వభంగం (డబ్బింగ్) | |||
రచన: | శ్రీశ్రీ | |||
సంగీతం: | పామర్తి, సుధీర్ ఫడ్కే | |||
గానం: | ఘంటసాల, బృందం | |||
బృందం: | ఊ.. ఊ.. ఓ.. ఓ.. ఆ.. ఆ.. | |||
పల్లవి: | ఘంటసాల: | పదునాలుగు లోకముల ఎదురే లేదే | ||
పదునాలుగు లోకముల ఎదురన్నది లేదుగ | ||||
మానవుడే సర్వశక్తి భావుడు కాదా! | ||||
మనుష్యుడిల మహానుభావుడే చూడగ | ||||
మనుష్యుడిల మహానుభావుడే | | మనుష్యుడిల | | |||
బృందం: | మనుష్యుడిల మహానుభావుడే చూడగ | |||
మనుష్యుడిల మహానుభావుడే | ||||
చరణం: | ఘంటసాల: | మానవుడే తలచినచో గిరుల నెగుర వేయడా | ||
మానవుడే తలచినచో నదుల గతుల మార్చడా | ||||
మానవుడే తలచినచో భూమ్యాకాశాలనే | ||||
ఏకముగా చేయగల సేతువు నిర్మించడా | ||||
మానవుడేనో.. | ||||
బృందం: | ఆ. ఆ. ఆ. | |||
ఘంటసాల: | మానవుడేనోయి సురాసుర కిన్నెర గంధర్వుల | |||
గర్వమణచ గలిగినట్టి శూరుడోయి | ||||
అందరు: | మనుష్యుడిల మహానుభావుడే చూడగ | |||
మనుష్యుడిల మహానుభావుడే | | మనుష్యుడిల | | |||
చరణం: | ఘంటసాల: | నయనమ్ముల రాగముతో, హృదయమ్మున స్నేహముతో | ||
మానవుడే సృష్టి కలంకారము | ||||
స్వేచ్ఛా స్వాతంత్ర్య మహా దీక్షా సాధన పరుడవు | ||||
మానవుడే యుగ భవన ద్వారము | ||||
మానవుడేనో.. | ||||
బృందం: | ఆ. ఆ. ఆ. | |||
ఘంటసాల: | మానవుడేనోయి ధరా మండలమున స్వర్గమునే | |||
స్థాపించగ జాలినట్టి వీరుడోయి | ||||
అందరు: | మనుష్యుడిల మహానుభావుడే చూడగ | |||
మనుష్యుడిల మహానుభావుడే | | మనుష్యుడిల | | |||
ఆ.. ఆ.. ఆ.. | ||||
చరణం: | ఘంటసాల: | ఖగనక్షత్రాల నడుమ, కమ్మిన చీకట్ల నడుమ | ||
మానవుడే కాంతి కిరణ దీపము | ||||
ప్రణయ సుధా ధారలతో ప్రళయ విష జ్వాలలతో | ||||
మానవుడే పరమాత్ముని రూపము | ||||
మానవుడేనో.. | ||||
బృందం: | ఆ. ఆ. ఆ. | |||
ఘంటసాల: | మానవుడేనోయి జరామరణములను దాటి | |||
సదా అమరకీర్తి నందగలుగు ధీరుడోయి | ||||
అందరు: | మనుష్యుడిల మహానుభావుడే చూడగ | |||
మనుష్యుడిల మహానుభావుడే |
కృతజ్ఞతలు: ఘంటసాల గళామృతము-తెలుగు పాటల పాలవెల్లి మరియు సాహిత్యంలో సవరణలు సూచించిన శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్ గారికి.
Thanks for the wonderful song which I never heard before.Apparao, Plymouth, UK
రిప్లయితొలగించండిశ్రీ నాగభైరు అప్పారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చాల చక్కని పాట. నేను కూడ ఇంతకు ముందు విని ఎరుగను. కొంత అన్వేషణలో దొరికింది. సఖియా.కామ్ లో చాల పాటలున్నాయి. బహుశ చాల మంది వినియుండరు.
తొలగించండిఅభినందనలు
రిప్లయితొలగించండిఈ పాటను గురించి తెలుసుకున్నాను ..శ్రీశ్రీ రచనలో మానవుని ఔన్నత్యం బాగా వ్యక్తమైనది.
ఈ పాట మళ్ళి వినాలనుంది..డౌన్లోడ్ సౌకర్యం వివరించాలని మనవి
రిప్లయితొలగించండిమానవుడేనోయి సురాసుర కిన్నెర గంధర్వుల గర్వమణచ గలిగినట్టి "శూరుడోయి" అని ఉండాలి
రిప్లయితొలగించండిధన్యవాదాలు రమేష్ గారు మీ సూచనకు. ఆ సవరణ చేసాను.
తొలగించండి1959 లో గాంధారి గర్వ భంగము సినిమా లొని శ్రీశ్రీ పాట తెలియజెసిన మీకు ధన్యవాదాలు🙏
రిప్లయితొలగించండి