శాపవశాన అష్టవసువులు గంగాదేవి కడుపున కొడుకులుగా పుడతారు. శంతనునితో గంగ చేసుకున్న ఒప్పందం ప్రకారం మొదటి ఏడుగురు బిడ్డలను గంగపాలు చేస్తాడు శంతనుడు. దేవవ్రతుడు గంగా-శంతనుల అష్టమ సంతానం. ఎనిమిదవ బిడ్డను చంప నిరాకరించిన శంతనుని విడిచి వెళ్ళిపోతుంది గంగ. ఆ బిడ్డ గంగ వద్ద గాంగేయుడు లేదా దేవ వ్రతుడుగా పెరిగి విలువిద్యా పారంగతుడవుతాడు. దేవవ్రతుడు తండ్రి కోర్కె తీర్చడానికి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ శపథం చేసి భీష్ముడవుతాడు. ఆ సన్నివేశం లో భీష్ముడు చెప్పిన పద్యం మాస్టారు చక్కగా గానం చేసారు. ఈ పద్యం యొక్క దృశ్య, శ్రవణ సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
చిత్రం: భీష్మ
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
గానం: ఘంటసాల
నా జన్మంబుతరింప చేసెద ప్రతిజ్ఞన్ దిక్పతుల్ సాక్షిగా
రాజై ఏలగ నాకు గల్గు నధికారంబున్ విసర్జింతు ఈ
రాజీవాక్షి సుతుండు వాని సుతులున్ రాజ్యంబు పాలింప నే
నీ జన్మాంతము బ్రహ్మచారినయి సేవింతున్ సదా రాజ్యమున్
ఆ.. ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి