1959 లో విడుదలైన "భక్త అంబరీష" చిత్రం విష్ణు భక్తుడు, అయోధ్యనేలిన రాజైన అంబరీషుని కథ. శ్రీమన్నారాయణుని దర్శనానికి కోవెలకు వెళ్ళగా, చాల మంది భక్తులు వుంటారు. పూజారులు అంబరీషునకు సంకల్పానికి పువ్వులివ్వగా, ఇంతమంది భక్తులు పూజ కోసం నిరీక్షిస్తుందగా తనకెందుకు ముందుగా ఇస్తున్నారు అని అడుగుతాడు. అందుకు బదులుగా "రాజులకు ప్రత్యేక దర్శనాలు, పూజలు సాంప్రదాయమని" పూజారి చెప్పగా, "రాజు కూడ ప్రజల లాగే సామాన్య మానవుడే కాని గొప్పవాడు కాదు, రాజైనా కూడ ఆలయంలో సామాన్య పౌరుని వలె అందరితో దర్శనం చేసుకోవాలి" అని అంబరీషుడు చెబుతాడు. తరువాత శ్రీహరిని స్తుతిస్తూ గానం చేస్తాడు. వినండి ఆ పాట మాస్టారి గళంలో.అంబరీషునిగా శ్రీ టి.ఎల్.కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) నటించారు.
చిత్రం: | భక్త అంబరీష | ||
రచన: | ఆరుద్ర | ||
సంగీతం: | ఎల్.మల్లేశ్వరరావు | ||
గానం: | ఘంటసాల, బృందం | ||
ఘంటసాల: | నీ సేవ దయ చేయుమా.. నీ సేవ దయ చేయుమా | | నీ సేవ | | |
ప్రభు నీ పాద కమలము, మా పాలి శరణము | |||
ఏడేడు జగములకు… నీవే శరణము | |||
బృందం: | నీవే శరణము .. నీసేవ దయ చేయుమా | ||
ఘంటసాల: | నిరతము మాపై నీ దయ పోదు | | నిరతము | | |
పేదల, ధనికుల భేదము లేదు | |||
బృందం: | పేదల ధనికుల భేదము లేదు | ||
ఘంటసాల: | లోపలనున్నా లోపము బాపి | | లోపల | | |
జ్యోతిని చూపుటలో .. నీదే భారము | |||
బృందం: | నీదే భారము .. నీ సేవ దయ చేయుమా | ||
ఘంటసాల: | ఇహమున పొందే ఏ సుఖమైన | | ఇహమున | | |
సంఘపు సేవల సాటికి రాదె | |||
బృందం: | సంఘపు సేవల సాటికి రాదె | ||
ఘంటసాల: | మానవసేవే మాధవసేవ | | మానవ | | |
మాకది ఒసగినచో అదియే చాలును | |||
బృందం: | అదియే చాలును.. నీ సేవ దయ చేయుమా | ||
శరణం శ్రీపతి.. శరణం శ్రీపతి.. శరణం శ్రీపతి | |||
ఘంటసాల: | ఆ.. ఆ.. ఆ.. |
What a good king.If such V.I.P are now existing
రిప్లయితొలగించండిTirumala becomes real Sanctum Sanctuary
రాధారావు గారు బాగా చెప్పారండి. ధన్యవాదాలు. శ్రీ రామనవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసూనా గారు, శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి.
రిప్లయితొలగించండినేనడిగిన పాట ఇంకా పెట్టలేదండి. వేచి ఉన్నాను.
హరి గారు, మీకు కూడ శ్రీరామనవమి శుభాకాంక్షలు. త్వరలోనే మీరు కోరిన పాట పోస్టు చేస్తాను. ఆ ప్రయత్నంలోనే వున్నాను.
తొలగించండి