చిత్రం: వినాయక చవితి (1957)
కలం: సముద్రాల సీనియర్
స్వరం-గళం: ఘంటసాల
పౌరాణిక చిత్రాలు, వాటిలో మాస్టారు పాడిన పద్యాలు వుంటే చెవులకు ఇంపుగా వుంటుంది వినడానికి. అందులో ఘంటసాల గారి స్వీయ సంగీత దర్సకత్వంలో వారు అమితంగా ఆరాదిచే శ్రీ సముద్రాల రాఘవాచార్యుల వారి సాహిత్యం తోడైతే ఇంకా రసవత్తరంగా వుంటుంది. 1957 లో విడుదలైన వినాయక చవితి చిత్రంలో శ్రీకృష్ణుని వలచి వరించాలనుకునే సత్యభామకు "స్త్రీకి ఉండవలసిన లక్షణాలు" ఏమిటో నారద మహర్షుల వారు వివరిస్తారు. మగువకు అందంతో పాటు అణకువ, చదువుతో పాటు శీల సంపత్తి, పతిసేవ, భక్తి, వినయము, వివేకము కలిగి యుండాలని ఈ పద్యం యొక్క తాత్పర్యం.

జగదేక రంభయే అగుగాక మగువకు అణకువే మాయని అందమమ్మా
చదువులలోన శారదయైన చెలువకు శీలమే సంస్కృతి చిహ్నమమ్మ
అల కుబేరుని పుత్రియైనను రమణికి పతిసేవయే మహాభాగ్యమమ్మ
దేవాదిదేవుని దేవియైనను స్త్రీకి త్యాగమే తారకయోగమమ్మ
భక్తి, వినయ వివేక సంపత్తి త్యాగశక్తి గల అన్నుమిన్నయే జగములోన
మగని రంజించి ప్రేమ సామ్రాజ్య సీమలేలెనో సత్యభామ భామాలలామ
అద్భుతం!
రిప్లయితొలగించండిచాలా బాగుంది. వినసొంపుగా ఉంది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరసజ్ఞ గారు, వనజ వనమాలి గారు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిIt is on our part to wonder how you are getting these kind of collection.Simply great.
రిప్లయితొలగించండిM.R.SUBRAHMANIAM
LET ME KNOW HOW TO TYPE IN TELUGU FONTS
Ee tharam adapillalaku idhi vinipishtey oppukorandi. Kaani ee padhya bhavamae sathyam
రిప్లయితొలగించండిSrinivasan
MSR గారు, కాలానుగుణంగా మార్పులు రావడం సహజమే. అందువలన దృక్పధాలలో, కట్టులో, కట్టుబాట్లలో, ఎన్నో రూపాంతరాలు జరుగుతున్నాయి. సమాన హక్కుల కోసం పోరాటం "లేచింది మహిళాలోకం" నుంచే మొదలయింది. అది మంచి మార్పు. కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా" అని స్త్రీ అన్ని పాత్రలు పోషించగలదు. వీటితో పాటు ఈ శుభలక్షణాలు ఉంటే ఇంక తిరుగులేదు. ఈ సమ్మేళనం స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఎక్కువ చేస్తుందే గాని తక్కువ చేయదు. దీనిని 1957 లో సముద్రాల సీనియర్ గారు చక్కగా చెప్పారు ఈ పద్యంలో. మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండిye tharamu vaarikaina idi avasaramenandi.appude stree ounnatyam telisedi
రిప్లయితొలగించండిహరి గారు, మీతో ఏకీభవిస్తాను. మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండి