రామ రావణ యుద్ధంలో లంకేశ్వరుడు శ్రీరాముని చేతిలో నిహతుడవుతాడు. తరువాత సీత అగ్ని పరీక్ష జరిగి, రాముడు సీతతో అయోధ్యకు తిరిగి వస్తాడు. దేవ దుందుభులు మ్రోగ, ఎంతో కన్నుల పండువగా అందరూ ఎదురు చూస్తున్న శ్రీ రామ పట్టాభిషేకం జరుగుతుంది. సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతముగా శ్రీరామచంద్రుడు కొలువు తీరినాడు. అప్పుడు కుల గురువు వశిష్టుల వారు శ్రీరాముని ఆశీర్వదిస్తూ, రామ నామము యొక్క విశిష్టత తెలుపుతూ చెప్పిన పద్యం "సర్వ మంగళ గుణ సంపూర్నుడగు నిన్ను". దీనిని ఎంతో మధురంగా ఘంటసాల మాస్టారు ఆలపించారు. రామ నామము చీకటిని పటాపంచలు చేసే తారక నామము. అథమం పది గడపలున్న చిన్న పల్లెలో కూడా రామమందిరం వుండి తీరుతుంది. ఏది వ్రాసినా ముందు రామనామము వ్రాయనిదే వ్రాత మొదలవదు. శ్రీ రామకోటి అంత పవిత్రమైనది - అని దీని భావం. రామునిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ, వసిష్టునిగా శ్రీ నాగయ్య నటించిన ఈ చిత్రం బాపు రమణీయ దృశ్య కావ్యం.
చిత్రం: సంపూర్ణరామాయణం (1972)
కలం: పానుగంటి
సంగీతం: కె.వి.మహదేవన్
గళం: ఘంటసాల, బృందం
ఘంటసాల: సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగాగ నరయు గాత!
రామనామము భవస్తోమభంజన దివ్య తారకనామమై తనరు గాత!
పది కొంపలునులేని పల్లెనైనను రామభజన మందిరముండు వరలు గాత!
కవులెల్ల నీ దివ్యకథ నెల్లరీతుల గొనియాడి ముక్తి గైకొండ్రు గాత!
ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక
వ్రాయ వడకుండు గావుత! రామ
వాక్యమనిన తిరుగనిదని అర్థమగును గాత!
రమ్య గుణధామ! రఘురామ! రామ! రామ!
బృందం: పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం
ఈ పద్యం "లవకుశ" చిత్ర ఆరంభంలో ఉన్నది. "సంపూర్ణరామాయణము" కాదనుకుంటాను.
రిప్లయితొలగించండిఈ పద్యం " సంపూర్ణ రామాయణం" చిత్రంలో చిట్టచివరి ఘట్టంలో శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన సమయంలో కులగురువు వశిష్టులవారు ఆశీర్వదిస్తూ అందించినది.
తొలగించండిఅద్భుతం🙏
రిప్లయితొలగించండి