ఘంటసాల మాస్టారు ఎన్.టి.ఆర్. కు ఎ.ఎన్.ఆర్.కు పాడేటప్పుడు గొంతులో చక్కని వైవిధ్యం చూపించేవారు. అయితే ఇద్దరికీ ఒకే పాటలో నేపథ్య గానం చేసిన పాటలు తక్కువ. అందులో చెప్పుకోదగినది "భూకైలాస్" చిత్రంలోని "దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో". స్థల పురాణం ప్రకారం ప్రకారం శివుని వరంతో ఆత్మలింగాన్నిసంపాదించి లంకలో స్థాపించవలెనని బయలుదేరిన రావణాసురుని వినాయకుడు యుక్తితో మార్గ మధ్యంలో బాలుని రూపంలో అడ్డుకుని గోకర్ణ క్షేత్రం వద్ద ఆ లింగాన్ని నేలపై మోపించి లంకాదీశ్వరునికి దక్కకుండా చేసే కథాంశం తో నిర్మింప బడిన చిత్రమిది. ఈ చిత్రంలో పరమశివుని కి అత్యంత ప్రియ భక్తుడైన రావణుడు (ఎన్.టి.ఆర్.) పాడగా చివరలో నారదుడు (ఎ.ఎన్.ఆర్.) అందుకుంటాడు. మాస్టారు ఇద్దరు నటులకూ ఒకే పాటలో పాడినా, ఆయన ఎవరికి పాడుతున్నారో కళ్ళు మూసుకుని విని చెప్పొచ్చు. ఈ రోజు శివరాత్రి. ఈ సంవత్సరం శివునికి ప్రీతి కలిగించే రోజైన సోమవారంనాడు ఈ పర్వదినం రావడం మన అదృష్టం. అయితే సోమ లేదా సోముడు అంటే చంద్రుడు కదా!, ఆ పేరున వచ్చేది సోమవారం (moon-Monday), మరి శివునికి సోమకు ఏమిటి సంబంధం? ఈ ప్రశ్నకు ఒకసారి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చక్కని భాష్యం చెప్పారు. "సోమ" = "స + ఉమ", అంటే ఉమతో కూడియున్నవాడు అని. ఈ పాటను శివరాత్రి కానుకగా మాస్టారి అభిమానులకు దృశ్య, సాహిత్యాలతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
వీడియో మూలం: ఘంటసాల గానామృతం
రచన: సముద్రాల రాఘవాచార్య
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల
ప. దేవదేవ ధవళాచలమందిర గంగాధరాహర నమో! నమో!
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో! | దేవదేవ |
అ.ప. పాలితకింకర భవనాశంకర శంకర పురహర నమో! నమో! | పాలిత కింకర |
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో! నమో! | హాలాహలధర |
దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో! నమో!
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!
చ. దురిత విమోచనా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో! నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో! నమో | కరిచర్మాంబర |
దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో! నమో!
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!
నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!
నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారద హృదయవిహారీ నమో! నమో! | నారద |
నారాయణ హరి నమో! నమో! | నారాయణ |
నారాయణ హరి నమో! నమో!
పంకజ నయనా పన్నగ శయనా .. ఆ.. ఆ
పంకజ నయనా పన్నగ శయనా
పంకజ నయనా పన్నగ శయనా
శంకర వినుత నమో! నమో! | శంకరవినుతా |
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నారాయణ హరి
నారాయణ హరి నమో! నమో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి