1949 లో విడుదలైన ధర్మాంగద ఒక జానపద చిత్రం. కాశ్మీర రాజు అయిన ధర్మాంగదుడు, భార్య అర్మిలిదేవికి సంతానం ఉండరు. సంతానం లేక రాజు పరమశివుని నిరసించడం వలన అతనికి ఒక సర్పం కొడుకుగా, నాగ కుమారుడై పుడతాడు. మరొక రాజు అయిన రత్నాంగదునికి త్రిలోకసుందరి అనే అందమైన కుమార్తె వుంటుంది. అతని వద్దనుండే రాజగురువు తనను రాజకుమారి తిరస్కరించిందన్న కక్షతో ఆమెకు పాము రూపం గల నాగ కుమారునితో వివాహం చేయిస్తాడు. వివాహం అయిన పిదప ఆమె తన పాతివ్రత్యంతో భర్తకు మానవరూపం వచ్చేలా చేస్తుంది. క్లుప్తంగా అదీ కథ. ఇందులో ధర్మాంగదుడుగా శ్రీ గోవిందరాజుల సుబ్బారావు (షావుకారు ఫేం), త్రిలోక సుందరి గా శ్రీమతి సి.కృష్ణవేణి, రాణి అర్మిలి దేవి గా శ్రీమతి ఋష్యేంద్రమణి, రాజ గురువుగా శ్రీ ముదిగొండ లింగమూర్తి గార్లు నటించారు. శ్రీమతి కృష్ణవేణి గారు గాయని, నటి, నిర్మాత. ఆమె మీర్జాపురం రాజా వారి సతీమణి. ఈ చిత్రానికి మాస్టారు మూడు పాటలు, ఒక పద్యం పాడారు. అయితే అందులో ఒక్కటి మాత్రమే దొరుకుతున్నది. ఆ పాట "జయీభవ విజయీభవ", చిత్రంలో ఒక సాధువు పాడతాడు. మాస్టారు పాడిన ఈ పాట యొక్క శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. (Story source from Sakhiyaa.com)
చిత్రం: ధర్మాంగద (1949)
సంగీతం: గాలి పెంచల నరసింహారావు
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
ప. జయీభవ! విజయీభవ! జయీభవ!
దీక్షా కంకణధారి విజయీభవ | దీక్షాకంకణ |
విజయీభవ! విజయీభవ!
విజయీభవ! విజయీభవ!
దీక్షా కంకణధారి విజయీభవ!
అ.ప. ధీర భావములు వీడకుమా | ధీర భావములు |
దిగ్విజయము నీవే సుమా | దిగ్విజయము |
దీక్షా కంకణధారి విజయీభవ!
చ. జయమో, మరణమో రెండే కాని
అన్యంబైనది శూన్యమె గాదా | జయమో |
దీక్షే కవచము, దీక్షే సాధన
దీక్షే సర్వము దీక్షే
దీక్షా కంకణధారి విజయీభవ!
చ. కార్యసిద్ధి చేకూరినదాకా
కష్టసుఖాలొక కంటనే చూడు | కార్యసిద్ధి |
వెనుకంజన్నది వెదకినా కలుగదు
అపజయమన్నది అసలే లేదు
దేవ దుందుభులు మ్రోగును నీకై | దేవ దుందుభులు |
కుసుమ వర్షములు కురియును నీకై
ప్రతి నోటను నీ పేరే వినబడు
ప్రజలకు నీవే మార్గదర్శివి | ప్రజలకు |
దీక్షా కంకణధారి విజయీభవ!
జయీభవ! విజయీభవ!
విజయీభవ! విజయీభవ!
Thanks for the song from Dharmaangada'not heard before by me .
రిప్లయితొలగించండిYou are welcome sir.
రిప్లయితొలగించండి