స్వరబ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు
(1921 - 2012)
సుసర్ల వారి సలలిత రాగ సుధారస సారం
శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు అనగానే ఎవరికైనా ముందు గుర్తుకి వచ్చేది నర్తనశాల చిత్రం. ఆ చిత్రానికి ఆయన అందించిన మధురమైన బాణీలు మరపు రానివి. ముఖ్యంగా "సలలిత రాగ సుధారస సారం" మరియు ఎన్నో రసవత్తరమైన ఘంటసాల మాస్టారి పద్యాలు. మాతృభాష తో నిమిత్తం లేకుండా ఎందఱో నూతన గాయనీ గాయకులను ప్రోత్సహించి, ధైర్యంగా తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత శ్రీ సుసర్ల వారిదే. అటువంటి గొప్ప సంగీత దర్శకులు వారు. ఆయన పరిచయం చేసిన వారిలో హిందీ - లతా మంగేష్కర్ గారు (సంతానం), తెలుగు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు (నర్తనశాల), ఒరియా - రఘునాథ్ పాణిగ్రాహి (ఇలవేల్పు), తమిళ - ఎం.ఎల్.వసంత కుమారి గారు (వచ్చిన కోడలు నచ్చింది), కన్నడ - బెంగుళూరు లత గారు (నర్తనశాల) మొదలయిన వారు. అంతేకాక హీరోలకు పాడే గాయకుల విషయంలో సుసర్ల వారు తీసుకున్న రిస్క్ ఎవరూ తీసుకోలేదు. రామారావు గారు హీరోగా, జగ్గయ్య గారు విలన్ గా నటించిన వీర కంకణం చిత్రంలో ఎ.ఎం.రాజాతో ఎన్.టి. ఆర్.కు, ఘంటసాల గారితో జగ్గయ్యకు, అలాగే ఇలవేల్పు చిత్రంలో ఎ.ఎన్.ఆర్. కు రఘునాథ్ పాణిగ్రాహి గారి చేత "చల్లని రాజా ఓ చందమామా" పాడించారు. ఆ పాట సూపర్ హిట్ అయిందని వేరే చెప్పనక్కరలేదు.
శ్రీ సుసర్ల గారు సంగీత దర్సకత్వం వహించిన కొన్ని ప్రముఖ చిత్రాలు సంసారం, నర్తనశాల, సంతానం, బలే బావ, కృష్ణ లీలలు, ఆలీబాబా 40 దొంగలు (డబ్బింగ్), అన్నపూర్ణ మొదలయినవి. సంతానం చిత్రంలో లతా మంగేష్కర్ గారు విడిగా మరియు ఘంటసాల గారితో కలసి పాడిన "నిదురపోరా తమ్ముడా", నర్తనశాల చిత్రానికి బాల మురళి గారు బెంగుళూరు లత గారితో పాడిన "సలలిత రాగ సుధారస సారం", ఇలవేలుపు చిత్రం కోసం పాణిగ్రాహి గారు పాడిన "చల్లని రాజా ఓ చందమామా" మంచి పేరు తెచ్చుకున్నాయి. శ్రీ సుసర్ల గారు స్వరపరచిన పాటలలో బలే బావ (1957) చిత్రంలోని "ఆనందమంతా అనురాగమంతా", సంసారం చిత్రం లోని "టకుటకు టకుటకు టముకుల బండి", డబ్బింగ్ చిత్రం ఆలీ బాబా 40 దొంగలు (1956) లోని "ప్రియతమా మనసు మారునా", సంతానం (1955) చిత్రంలోని పద్యాలు "బావా ఎప్పుడు వచ్చితీవు", పోకన్ మానదు", కృష్ణలీలలు (1959 ) చిత్రంలోని "తరమే బ్రహ్మకునైన", "నిరత సత్య ప్రౌడి", "బ్రహ్మ రుద్రాదులంతటి" పద్యాలు ఇటీవల ప్రచురించాను. ఇటీవల శ్రీ దక్షిణా మూర్తిగారిని ఒక టీవీ వారు చేసిన ఇంటర్వ్యూను నా "ఘంటసాల" బ్లాగులో ప్రస్తావించాను.
శ్రీ దక్షిణామూర్తి గారు నేడు భారత కాల మానం ప్రకారం ఫిబ్రవరి 9, గురువారం రాత్రి మదరాసులో దివంగతులయారు. వారికి తొంభయి సంవత్సరాలు. మూర్తి గారూ, మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ చక్కని పాటలు అజరామరంగా నిలిచి ఎల్లప్పుడూ మీ జ్ఞాపకాల్ని మాతో, మాలో, మా మనస్సులో ఉంచుతాయి. శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారిపై మ్యుజికాలజిస్ట్ శ్రీ రాజా గారు వ్రాసిన సమీక్ష ఈనాడు ఇంటర్ నెట్ ఎడిషన్ లో వచ్చింది. అది ఇక్కడ చూడగలరు.
మీకిదే అశ్రు నివాళి.
హృదయ పూర్వక వినమ్ర శ్రద్ధాంజలి.
శ్రీ సూరి గారికి,
రిప్లయితొలగించండిశ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు దివంగతులైనారని విని చాల బాధ పడ్డాను. ఎన్నో చిత్రాలలో మంచి సంగీతాన్ని అందించి, సంగీత ప్రియుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్న మహానుభావుడు శ్రీ సుసర్ల గారు. ఒక మంచి సంగీత దర్శకుడిని మనం కోల్పోయాం. మీ శ్రద్దాంజలి బాగా ఉన్నది. ఆయన మనసుకు శాంతి కలగాలని ప
ప్రార్థిస్తూ ......కే వి రావు
శ్రీ వెంకోబా రావు గారు. నమస్కారం. నేను ఈ మధ్యనే శ్రీ సుసర్ల గారి గురించి నా బ్లాగులో వ్రాసాను. ఎంతో గొప్ప సంగీత దర్శకులు వారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతీః
తొలగించండిఈ పోస్టు వ్రాయడంలో పొరపాటున వేరొక ఫోటో అప్ లోడ్ చేయడం జరిగింది. దానిని తొలగించాను. అలాగే వీర కంకణం, ఆలీబాబా 40 దొంగలు (డబ్బింగ్) చిత్రాలకు, సంగీతం శ్రీ సుసర్ల వారు సమకూర్చినా, వాటి తమిళ మాతృకలకు బాణీలు సుసర్లగారివి కావని మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా గారు సహృదయతతో సూచించారు. శ్రీ రాజా గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ సుసర్లవారి ఛాయాచిత్రాన్ని పంపిన మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా గారికి ధన్యవాదాలు.
తొలగించండిSurya narayana gaaru,
తొలగించండిchaala manchi Seva chesthunnaaru.Maa valla idhantha cheya leka poyina mee shramakuku,shraddha ku Johaa.....rlu telupaka pothe maha paapam.
M.R.Subrahmaniam
Dear Subrahmaniam garu, thanks for your good words. It is my pleasure. Music is divine.
తొలగించండిWe are very sad to loose such a great composer.A heart breaking news
రిప్లయితొలగించండిradharao
అవునండీ. చాల దురదౄష్టం. శ్రీ సుసర్ల వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.
తొలగించండిA few more songs that I remember like 'samsaram samsaram premasudhapuram' 'challani vennelalo' are available here:
రిప్లయితొలగించండిhttp://www.muzigle.com/artist/susarla-dakshinamurthy
Thanks Gaddeswarup garu. Yes. There are lot more to his credit. He is a great soul.
తొలగించండిస్వర్ణ యుగ కారులు ఒక్కొక్కరే ఇలా తమదారి తాము చూసుకోవడము....దుర్భరము. సంసారం సంసారం పాటని ఘంటసాలగారిచే సుసర్ల గారు పాడించిన తీరు అనితర సాధ్యము...ఆయన పాటలన్నీ కళా ఖండాలే. మాస్టారు గారు లేని ఇలన తానెందుకని వెళ్ళిపోయారేమో... వారిరువురి ఆత్మలు సంతోషంగా పిచ్చాపాటీ చెప్పుకుంటూ , వీలైతే కొత్తబాణీలు కట్టుకుంటూ పాడుకుంటూ ఉంటాయని ఊహించి మన మనసులు స్వాంతన పరచుకోవడమే మనమిక చేయగలిగినది.
రిప్లయితొలగించండిభగవంతుడూ , త్వరలోనే వారిని మళ్ళీ ఇక్కడికి పంపు నాయనా....
శర్మ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అటువంటి మహానుభావులు మరలా మన మధ్యకు రావాలని అందరి కోరిక.
తొలగించండిశ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి తాత గారు, సాక్షాత్తూ శ్రీ త్యాగరాజస్వామివారి శిష్యులు.
రిప్లయితొలగించండి