అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లోని రాలీ (Raleigh, NC) పట్టణంలో నవంబరు 2011 లో హైదరాబాదు కు చెందిన వేగేశ్న ఫౌండేషన్ వారు వికలాంగుల సహాయార్ధం స్థానిక ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) అధ్వర్యంలో నాలుగవ ఘంటసాల ఆరాధనోత్సవం మరియు ప్రధమ బాలు సంగీతోత్సవం నిర్వహించారు. వేగేశ్న సంస్థకు చెందిన శ్రీ వంశీ రామరాజు గారు మాట్లాడుతూ తమ ప్రయత్నం "వికలాంగులను సకలాంగులుగా" చేయడమని, ఆ యజ్ఞంలో భాగంగా ఘంటసాల గారి పాటలతో విరాళాలను సేకరించుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులు హ్యుస్టన్, టెక్సాస్ కు చెందిన శ్రీమతి మణిశాస్త్రి గారు, హైదరాబాదుకు చెందిన శ్రీమతి గానాంజలి గారు, శ్రీ తాతా బాలకామేశ్వరరావు గారు, శ్రీ వినోద్‍బాబు గారు, స్థానిక గాయకులు సూర్యనారాయణ వులిమిరి, పలు ప్రసిద్ధమైన ఘంటసాల మరియు ఎస్.పి.బాలసుబ్రమణ్యం గార్ల పాటలను కెరియోకీలతో అద్భుతంగా గానం చేసి శ్రోతలను ఆనందింపజేసారు. వారు పాడిన పాటలలో ఈ వీడియోలో కొన్ని మాత్రం చూపించడం జరిగింది. అవి:
వాతాపి గణపతింభజే | (వినాయకచవితి) | - బాలకామేశ్వరరావు; |
దేవదేవ ధవళాచల | (భూకైలాస్) | - బాలకామేశ్వరరావు; |
భలే మంచిరోజు | (జరిగిన కథ) | - వినోద్ బాబు; |
సఖియా వివరించవే | (నర్తనశాల) | - మణిశాస్త్రి; |
పార్వతి స్తోత్రం | (ప్రైవేట్ సాంగ్) | - గానాంజలి; |
ఆడవే మయూరి | (చెల్లెలికాపురం) | - వినోద్ బాబు; |
శివశంకరీ | (జగదేకవీరునికథ) | - బాలకామేశ్వరరావు, వినోద్ బాబు; |
కురిసేను విరిజల్లులె | (ఘర్షణ) | - గానాంజలి, వినోద్ బాబు; |
తెలిసిందిలే తెలిసిందిలే | (రాముడు-భీముడు) | - బాలకామేశ్వరరావు, మణిశాస్త్రి; |
పల్లెకు పోదాం | (దేవదాసు) | - వినోద్ బాబు; |
జయజయమహాదేవ శంభో | (కాళహస్తి మహత్మ్యం) | - సూర్యనారాయణ వులిమిరి; |
నీలీల పాడెద దేవా | (మురిపించే మువ్వలు) | - మణిశాస్త్రి; |
నగుమోము గనలేని | (త్యాగరాజకీర్తన) | - గానాంజలి; |
శిలలపే శిల్పాలు | (మంచిమనసులు) | - బాలకామేశ్వరరావు; |
ఝుమ్మంది నాదం | (సిరిసిరిమువ్వ) | - వినోద్ బాబు, మణిశాస్త్రి; |
పుష్పవిలాపం | (ప్రైవేట్ సాంగ్) | - బాలకామేశ్వరరావు; |
సాథీయా తూనే క్యాకియా | (హిందీ) | - వినోద్ బాబు, గానాంజలి; |
మది శారదాదేవి మందిరమే | (జయభేరి) | - బాలకామేశ్వరరావు. |
తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కుమార్ నెప్పల్లిగారు వందన సమర్పణ చేసారు. టాటా కు చెందిన కమిటీ సభ్యులు శ్రీ నండూరి సాంబశివరావు గారు కార్యక్రమం నిర్వహించడంలో, వీడియో తీయడంలో సహకరించారు. సూర్యనారాయణ వులిమిరి గాయకులకు, వేగేశ్న నిర్వాహకులకు తమ యింట ఆతిధ్యమిచ్చారు. వీడియో ఆఖరున కనిపించే గ్రూప్ ఫోటోలో ఉన్నవారు, ఎడమ నుండి కుడికి -కుమార్ నెప్పల్లి, సూర్యనారాయణ వులిమిరి, తాతా బాలకామేశ్వర రావు, వినోద్ బాబు, నండూరి సాంబశివరావు, వంశీ రామరాజు, గానాంజలి, మరియు మణిశాస్త్రి. ఈ కార్యక్రమము యొక్క కవరేజి టీవీ 9 లో ప్రసారమయింది. ఆ వీడియోను దిగువన పొందుపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమం కోసం స్థానిక దాతలు సుమారు పదివేల డాలర్ల విరాళాలు ఇచ్చారు. మాస్టారి పాట ఎంతమందికో జీవనోపాధి చూపిస్తోంది కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి