ఘంటసాల మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు!
ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారి 89వ పుట్టినరోజు. ఆ మహానుభావుని గురించి ఎంతయినా వ్రాయవచ్చును. ఆయన కారణజన్ముడు. తెలుగువారికి శ్రీ ఘంటసాల ఒక అమూల్యమైన వరం. ఆయన పేరిట ఎందరికో సంగీతంలో అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆయన పాట ఎంతోమంది అభాగ్యులైన పిల్లలకు జీవనోపాధిని, క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. ఒక పాట అన్నా, పద్యం అన్నా ఇలా పాడాలన్న ప్రామాణికాన్ని నెలకొల్పింది ఆయన మంగళ గళం. మాస్టారు పాడిన పాటలలో ఏ పండగకైనా, కార్యక్రమానికైనా హాయిగా పాడుకునే పాట "జరిగిన కథ" చిత్రానికి శ్రీ సినారె వ్రాసిన "బలే మంచిరోజు పసందైన రోజు" అని ఒకసారి జనరంజని రేడియో కార్యక్రమంలో మాస్టారు అన్నారు. వారి పుట్టిన రోజున పసందైన ఈ పాటను, మాస్టారి మాటలను క్రింది ఆడియో ఫైలు లో వినండి. ఆడియో మూలం "ఘంటసాల గాన చరిత".
ఈ సందర్భంగా మాస్టారి గురించి తెలిపే, తెలుసుకోగలిగే కొద్ది సమాచారాన్ని నాకు అవగతమైన మేరలో తోటి ఘంటసాల అభిమానులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఈ సందర్భంగా మాస్టారి గురించి తెలిపే, తెలుసుకోగలిగే కొద్ది సమాచారాన్ని నాకు అవగతమైన మేరలో తోటి ఘంటసాల అభిమానులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
మన ఘంటసాల - ఘంటసాల ప్రాజక్టు: ఈ సైటులో ఘంటసాల మాస్టారికి సంబంధించిన అన్ని వివరాలు దొరుకుతాయి. ముఖ్యంగా మాస్టారికి పలువురు సమర్పించిన నివాళులు, ఛాయా చిత్రాలు, వ్యాఖ్యానాలు, మాస్టారి కచేరీలు (న్యూయార్క్, చికాగో, మరియు కలకత్తా), పద్యాలు, పాటలు, భగవద్గీత, ఫన్ గేమ్స్, పాటల డేటాబేస్, గీతాల సాహిత్యము (లిరిక్స్) లభ్యమవుతాయి. ఈ సైట్ ను అభివృద్ధి పరచడంలో పలువురు ఘంటసాల అభిమానులు చేయూతనిస్తున్నారు. మాస్టారు పాడిన మొదటి పాట నుండి 60 ల వరకు మాస్టారు పాడిన, సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలు, పద్యాలు, కాలక్రమంలో అమర్చబడి వున్నాయి. ఈ పాటలన్నిటినీ వినొచ్చు లేదా భద్రపరచుకొన (download) వచ్చును. ఆయా లింకుల కోసం కావలసిన పదం మీద క్లిక్ చేయండి.
ఘంటసాల యాహూ గ్రూప్: ఇది ఇ-లేఖ (e-mail) గ్రూప్. ఇందులో మాస్టారికి సంబంధించిన పాటల, చిత్రాల తదితర విషయాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనవచ్చును, లేదా పాల్గొనవచ్చును. అంతేకాక ఘంటసాల గారి పాటల లిరిక్స్, ఆడియో ఫైల్సు, యూ ట్యూబ్ వీడియో లింకులు మాస్టారి అభిమానులచే పోస్టు చేయబడతాయి. ఈ ఇ-గ్రూప్ లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి: పలువురు ఘంటసాల మాస్టారి అభిమానులు కలసి వారి పాటల, చిత్రాల వివరాలను సేకరించి, సమకూర్చిన వెబ్ సైట్ ఇది. ఇందులో అక్షరక్రమంలో ఘంటసాల గారు పాడిన, సంగీత దర్శకత్వం నిర్వహించిన చిత్రాలలోని పాటల, పద్యాల వివరాలు పొందుపరచబడి వున్నాయి. దీనిని నిర్వహిస్తున్నది శ్రీ కొల్లూరి భాస్కర రావు గారు. వీరు హైదరాబాదు ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు.
సఖియా: ఈ వెబ్ సైటు పైన పేర్కొన్న "ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి" కి అనుబంధమైనది. ఇందులో 1930 ల నుండి 1960 ల వరకు వచ్చిన చాల తెలుగు చిత్రాల వివరాలన్నీ దొరుకుతాయి. ప్రతి చిత్రానికి సంబంధించిన సాంకేతిక వర్గం, పాటల విషయ సూచిక, మరియు ఆడియో ఫైల్సు పొందుపరచబడి వున్నాయి.
వేగేశ్న ఫౌండేషన్: వికలాంగులను సకలాంగులుగా చేసే ఉన్నతమైన ఆశయంతో హైదరాబాదులోని హయత్ నగర్ లో వేగేశ్న ఫౌండేషన్ స్థాపించబడింది. ఈ సంస్థను నిర్వహిస్తున్న శ్రీ వంశీ రామరాజు గారు ప్రతి సంవత్సరం శ్రీ ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు జరుపుతుంటారు. స్వదేశంలోను, ప్రవాసంలోను నివాసం చేస్తున్న ప్రఖ్యాత గాయనీ, గాయకులతో మాస్టారి పాటల కచేరీలను పలు నగరాలలో ఏర్పాటు చేసి వికలాంగులైన పిల్లల అభివృద్ధికి విరాళాలు సేకరిస్తుంది ఈ సంస్థ. ఒకానొక కార్యక్రమంలో రామరాజు గారు మాట్లాడుతూ "ఘంటసాల మాస్టారి పాటలు ఈ పిల్లలకు భవిష్యత్తును యిచ్చాయి". వీరంతా మాస్టారికి ఎంతో ఋణపడి వున్నారు" అని అన్నారు. ఆ విధంగా మాస్టారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, వారు మన మనసులలో చిరస్థాయిగా నిలిచి వున్నారు, వారి పాటలు ఎందఱో అభాగ్యుల చీకటి హృదయాలలో వెలుగును నింపుతున్నాయి.
ఘంటసాల పాటల సాహిత్యం దొరికే కొన్ని వెబ్ సైట్లు:

Old Telugu Songs: ఈ సైటులో తెలుగు చిత్ర పరిశ్రమ ఆరంభం నుండి సుమారు 1960s వరకు విడుదలయిన చిత్రాల పాటలు free గా download చేసుకోవచ్చును. అంతేకాక కావలసిన సినిమా, గాయని లేదా గాయకుడు, సంగీత దర్శకుడు/దర్శకురాలు, లేదా గీత రచయితను, లేదా వారి కాంబినేషను గాని ఎన్నుకొని పాటలను వెదుక్కోవచ్చు.
చిమట-మ్యూజిక్: ఈ వెబ్ సైట్ లో ఘంటసాల గారితో మొదలుకొని అందరు తెలుగు చలన చిత్ర రంగం లోని గాయనీ గాయకుల పాటల ఆడియోలు, కొన్ని వీడియో మరియు లిరిక్స్ యొక్క లింకులు దొరుకుతాయి.
వేగేశ్న ఫౌండేషన్: వికలాంగులను సకలాంగులుగా చేసే ఉన్నతమైన ఆశయంతో హైదరాబాదులోని హయత్ నగర్ లో వేగేశ్న ఫౌండేషన్ స్థాపించబడింది. ఈ సంస్థను నిర్వహిస్తున్న శ్రీ వంశీ రామరాజు గారు ప్రతి సంవత్సరం శ్రీ ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు జరుపుతుంటారు. స్వదేశంలోను, ప్రవాసంలోను నివాసం చేస్తున్న ప్రఖ్యాత గాయనీ, గాయకులతో మాస్టారి పాటల కచేరీలను పలు నగరాలలో ఏర్పాటు చేసి వికలాంగులైన పిల్లల అభివృద్ధికి విరాళాలు సేకరిస్తుంది ఈ సంస్థ. ఒకానొక కార్యక్రమంలో రామరాజు గారు మాట్లాడుతూ "ఘంటసాల మాస్టారి పాటలు ఈ పిల్లలకు భవిష్యత్తును యిచ్చాయి". వీరంతా మాస్టారికి ఎంతో ఋణపడి వున్నారు" అని అన్నారు. ఆ విధంగా మాస్టారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, వారు మన మనసులలో చిరస్థాయిగా నిలిచి వున్నారు, వారి పాటలు ఎందఱో అభాగ్యుల చీకటి హృదయాలలో వెలుగును నింపుతున్నాయి.
ఘంటసాల పాటల సాహిత్యం దొరికే కొన్ని వెబ్ సైట్లు:
ఘంటసాల: ఇది నా బ్లాగు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పద్యాల, పాటల సాహిత్యాన్ని పొందు పరచే ప్రయత్నం చేస్తున్నాను. సాహిత్యంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే సహృదయంతో క్షమించి, సవరణలు సూచించ గలరు.
సూచన: మీ స్పందనను బ్లాగ్ పోస్టు దిగువన గల కామెంట్స్ బాక్స్ లో వ్రాయ గలరు. ఇతర సమాచారం కొరకు suryvulimiri@gmail.com కు వ్రాయగలరు.
సూచన: మీ స్పందనను బ్లాగ్ పోస్టు దిగువన గల కామెంట్స్ బాక్స్ లో వ్రాయ గలరు. ఇతర సమాచారం కొరకు suryvulimiri@gmail.com కు వ్రాయగలరు.
సూర్యనారాయణ గారూ ఘంటసాల మాష్టారి గురించి చక్కని వ్యాసం. ఘంటసాల గారికి జన్మదిన సుభాకాంక్షలు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు, ధన్యవాదాలు
రిప్లయితొలగించండిMeeting you and talking gave me pleasure. We exchanged many views about Ghantasala Mastaru. As you told me, you have given the various sites about Mastaru, for the information of many Ghantasala lovers.Thanking you..kasirao
రిప్లయితొలగించండిశ్రీ కె.వి.రావు గారికి. పెద్దలు, అనుభవజ్ఞులు, మాస్టారి అభిమానులు మిమ్ములను కలవడం నా అదృష్టం. మీ వలన మాస్టారి గురించి చాల విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినమస్తే సూర్యనారాయణ గారు __/\__
రిప్లయితొలగించండినా బ్లాగును అందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
నాదో చిన్న ఆశ మీ బ్లాగు లింక్.. నా బ్లాగులో పెట్టోచ్చా?
మీ అంగీకారం కొరకు ఎదురు చూస్తూ
ప్రేమతో..
శక్తి
హలో శక్తి, తప్పకుండానమ్మా. ఇది పబ్లిక్ డొమైన్. దీనికి అనుమతి అవసరం లేదు. అయినా అడిగారంటే అది మీ సహృదయత. భవిష్యత్తులో నేను కూడ మీ బ్లాగులింకులను ఊయోగిస్తాను. ఎవరు చేసినా ఇది ఘంటసాల మాస్టారి గాన సంపదనను తెలుగు వారందరికీ పంచడమే దీని ప్రధాన ఉద్దేశం.
రిప్లయితొలగించండిసూరి గారు,
రిప్లయితొలగించండిఘంటసాల గారి గురించి తెలిపే వెబ్ సైట్స్ అన్నీ ఒకచోట పొందుపరిచిందుకు ధన్యవాదాలు.
- మురళి సగిలి.
మురళిగారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి