1954 లో ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్., శ్రీరంజని, సావిత్రి నటించిన విజయా వారి చిత్రం 'చంద్రహారం' అంత ఆర్ధిక విజయం సాధించలేదు. దానికి కారణం సరియైన కథా బలం లేకపోవడం. కథానాయకుడైన రామారావు గారి పాత్ర చాల వరకు విగతమై పడి వుంటుంది. అందువలన అతనికి ధైర్య సాహసాలు ప్రదర్శించే అవకాశం లేదు. భార్య (శ్రీరంజని) పాతివ్రత్యం తో తప్ప అతనికి పునర్జన్మ లభించదు. అంతేకాక ఆనాడు కన్నీటి కనక వర్ష తార గా ప్రసిద్ధి చెందిన శ్రీరంజని ప్రేక్షకులను మరీ ఏడిపించినదనుకుంటా. ఎంతో ఉల్లాసంగా ఉండే సావిత్రి పాత్ర విలన్ పాత్ర. అదీ ఒక దెబ్బే మరి. అయితే సంగీతం మాత్రం అద్భుతం. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి చక్కని బాణీలు కూర్చారు. అందులో ఎక్కువగా విననిది, చక్కని ఆణిముత్యం వంటి పాట "టైటిల్ సాంగ్", పింగళి నాగేంద్ర రావు గారు రచించిన "విజ్ఞాన దీపమును వెలిగించ రారయ్య". దీనిని మాస్టారు, ఎ.పి.కోమల, బృందం పాడారు. శ్రీమతి ఎ.పి.కోమల 1940 ల నుండి 60 ల వరకు మాస్టారితో సుమారు 9 యుగళ గీతాలు రక్షరేఖ, రహస్యం, సత్యనారాయణ మహాత్మ్యం, చంద్రహారం, పాండురంగ మహాత్మ్యం, బాలసన్యాసమ్మ కథ మొదలయిన చిత్రాలలో పాడారు. ఆపాట ఆడియో, వీడియో, మరియు సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను.
రచన: పింగళి నాగేంద్రరావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, ఎ.పి.కోమల, బృందం
పాట: (టైటిల్ సాంగ్)
ఘంటసాల: ఓమ్!,
కోమల-బృందం: ఓమ్!, ఓమ్!
ఘంటసాల: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
కోమల-బృందం: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఘంటసాల: అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
కోమల-బృందం: అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
అందరు: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఘంటసాల: పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమే...
కోమల-బృందం: పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమె
అందరు: మానవుల ధర్మమని భావించరయ్యా
అందరు: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఘంటసాల: వినయమున, సహనమున విజయములు సాధించీ..
అందరు: వినయమున, సహనమున విజయములు సాధించి
దీన బలహీనులను కరుణతో పాలించి
ఘంటసాల: జీవులకు, దేవులకు భేదమే లేదనీ..
కోమల-బృందం: జీవులకు, దేవులకు భేదమే లేదనీ
భువిని ఈ సత్యమును చాటించరయ్యా
అందరు: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
విజ్ఞాన దీ..పం
Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the video in You Tube.
Dear Suryanarayana garu,
రిప్లయితొలగించండిThanks for a very comprehensive post about Ghantasala. I would like to share my thoughts with you.
Please go through my you tube videos.
http://www.youtube.com/results?search_query=nagabhyru&oq=nagabhyru&aq=f&aqi=g1g-m1&aql=&gs_sm=s&gs_upl=327l645l0l9650l2l2l0l0l0l0l1112l1536l4-1.7-1l2l0
OR go to You Tube and type my name nagabhyru and you will get my videos.
Dr. Apparao nagabhyru UK (at present lives in Vizag)
Dear Dr. Apparao garu, thanks for your appreciation. I watched some of your videos. Wonderful singing. Did you move to Vizag? My home town is Srikakulam where my parents live.
రిప్లయితొలగించండిNo words for me to praise your service to humanity.
రిప్లయితొలగించండిBhakthi and music only will purify and relax inner soul.
Hats off to your noble work.
I can understand that you have spent lot of hours for this blog.
Manchini penche vaarini manasaara abhinandhisthe adhee manchi karya mavuthundi.
Dear Subrahmaniam garu, Thanks for your noble words. It is possible because of aaseervaadam from people like you.
రిప్లయితొలగించండిDear Suryanarayana garu,
రిప్లయితొలగించండిEe paata Tamilamlo naa daggira undi.
Kaavalante meeku pampistanu
great song....thanks for the song.
రిప్లయితొలగించండిThanks Kishenji
తొలగించండిGhantasala achieved a kind of a perfection in directing music to this song.. and sang it to perfection too with A P Komala and chorus.. Thanks for sharing this wonderful song with us..
రిప్లయితొలగించండిసారంగరాగం ఆధారంగా చేసినదిగా చెప్పవచ్చు
రిప్లయితొలగించండి