అక్కినేని నాగేశ్వర రావు, భానుమతి, అంజలీదేవి నటించిన జానపద చిత్రం రక్షరేఖ. ఈ చిత్రంలో మొత్తం పాటలు, పద్యాలు 16 దాకా ఉన్నాయి. అయితే కొన్ని మాత్రమె అందుబాటులో వున్నాయి. అందులో ఘంటసాల మాస్టారు పాడినవి మూడు పాటలు. ప్రస్తుతం ఈ పోస్టులో ఘంటసాల గారు భానుమతి గారితో పాడిన మధురమైన యుగళగీతం - "జీవన డోలి, మధుర జీవన కేళీ" పొందు పరుస్తున్నాను. ఈ చిత్రం యొక్క ఆంగ్ల సమీక్ష లభ్యం అవుతోంది.
చిత్రం: రక్షరేఖ (1949)
రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు, హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి
గానం: ఘంటసాల, పి.భానుమతి
ఘంటసాల: జీవన డోలీ! జీవన డోలీ! మధుర జీవన కేళీ
ఇదే ప్రేమ సుధా వాహినీ!
ఇద్దరు: ఓ! ప్రియా తేలుదమే హాయిగా
జీవన డోలీ! జీవన డోలీ! మధుర జీవన కేళీ
ఇదే ప్రేమ సుధా వాహినీ!
ఓ! ప్రియా తేలుదమే హాయిగా
ఘంటసాల: జీవన డోలి
భానుమతి: ఓ.. ఓ. ఓ.. ఓ..
నీవే సరంగువి! ప్రేమ కేళి డోలికి | నీవే |
ఆనంద వాహినిలో హాయి సాగి పోవగా
ఓ! ప్రియా తేలుదమే హాయిగా జీవన డోలి
ఘంటసాల: ఆ..ఆ.
నీవే చుక్కానివిగ నడుపు అదో ప్రేమ నగరి! | నీవే |
ఓ!.. చెలీ చేరుదమే హాయిగా జీవన డోలి
భానుమతి: పున్నమ రేయి! పాల వెన్నెలలో హాయి | పున్నమ |
పోనిమ్మా సరాసరి డోలికా
ఓ! మనోహరా! ఓ! మనోహరా! (2)
ఓ! ప్రియా తేలుదమే హాయిగా జీవన డోళి
ఘంటసాల: వలి పూల గాలి సాగే
భానుమతి: సుమ డోలి ఉయ్యాలూగే
ఘంటసాల: వలి పూల గాలి సాగే
భానుమతి: సుమ డోలి ఉయ్యాలూగే
చెలీ చంద్రికా! అదే ప్రేమనగరీ (2)
ప్రేమసఖా
ఘంటసాల: ప్రేమ సఖీ
భానుమతి: ప్రేమ సఖా చేరుదమా
ఘంటసాల: ప్రేమ సఖీ చేరుదమే
ఇద్దరు: ఓ ప్రియా! చేరుదమే హాయిగా
జీవన డోలీ! జీవన డోలీ! మధుర జీవన కేళీ
ఇదే ప్రేమ సుధా వాహినీ!
ఓ! ప్రియా తేలుదమే హాయిగా జీవన డోలీ!
గమనిక: ఈ పాట సాహిత్యాన్ని PDF file గ download చేసుకోవడానికి దిగువనగల printfriendly ని click చేసి save చేసుకోవచ్చును.Thanks to GVS Sastry garu for the audio-video clip.
గమనిక: ఈ పాట సాహిత్యాన్ని PDF file గ download చేసుకోవడానికి దిగువనగల printfriendly ని click చేసి save చేసుకోవచ్చును.Thanks to GVS Sastry garu for the audio-video clip.
మంచి పాటను పరిచయం చేసినందుకు ధన్యవాదములు!
రిప్లయితొలగించండిదీన్ని ఎలా download చేసుకోవాలి?
సౌమ్యగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఆడియో ఫైలు పైన "ఘంటసాల గాన చరిత" అన్న లింకును క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్ సైటుకు తీసుకువెళుతుంది. అక్కడి పాటల భాండాగారంలో మీకు కావలసిన పాటను డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
రిప్లయితొలగించండిసూర్య నారాయణ గారు
రిప్లయితొలగించండిచాలా చాలా thanks!
download చేసుకున్నానండీ....మంచి పాట వినిపించినందుకు ధన్యవాదములు!