కార్తీక మాసం శివునికి అత్యంత ప్రియమైన మాసం. ఈ మాసంలో చాల మంది భక్తులు శివయ్యకు రుద్రాభిషేకాలు చేస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో నా బ్లాగులో గరళ కంఠునికి మాస్టారి గళ గానామృతంతో అభిషేకం చేసాము. మరి అయ్యవారిని అంతగా పొగిడి అమ్మవారిని తలచుకోకపోతే ఎలా? అందుకే శ్రీ పార్వతీ దేవి పై "కాళ హస్తి మహత్మ్యం" నుండి పి.సుశీల చక్కని గొంతులో ఈ భక్తి గీతాన్ని అందిస్తున్నాను. ఆస్వాదించండి. ఈ పాట పూజలలోను, చిన్న చిన్న పేరంటాలలోను పాడుకోవడానికి చాల చక్కగా వుంటుంది.
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి వెంకటరెడ్డి
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: పి.సుశీల
ప. శ్రీ పార్వతీదేవీ చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ! గౌరీ...శంకరీ
చ. ప్రాపు నీవె పాపహారీ పద్మపత్ర నేత్రీ |ప్రాపు నీవె|
కాపాడ రావమ్మా! కాత్యాయినీ.. |కాపాడ రావమ్మా|
శ్రీ పార్వతీదేవీ చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ! గౌరీ...శంకరీ
చ. నిన్ను నమ్మినాను తల్లీ అన్నపూర్ణ దేవీ |నిన్ను నమ్మినాను|
పాలించ రావమ్మా పరమేశ్వరీ.. |పాలించ రావమ్మా|
శ్రీ పార్వతీదేవీ చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ! గౌరీ...శంకరీ
ఇంట్లో పెద్ద వాళ్ళు పాడుతుంటే విన్నానండీ..చాలా ఇష్టం నాకు యీ పాట..మీరన్నట్టు పూజల్లోను,పేరంటాల్లోను బాగుంటుంది.
రిప్లయితొలగించండి