నాగేశ్వర రావు, అంజలి |
ఘంటసాల గారు ముందుగా రత్నమాల, బాలరాజు చిత్రాలలో కొన్ని పాటలకు సంగీతం సమకూర్చగా, వారు సంపూర్ణంగా సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం "కీలుగుఱ్ఱం". దీని నిర్మాణం మరియు దర్శకత్వం శ్రీ మీర్జాపూర్ రాజు గారు నిర్వహించారు. కథ, మాటలు, పాటలు శ్రీ తాపీ ధర్మారావు గారు సమకూర్చారు. ఇది సంగీత, సాహిత్య పరంగా విజయవంతమైన చిత్రం కూడా. అంతేకాక, అక్కినేని నాగేశ్వర రావు గారి చిత్రాలలో 100 రోజులు ఆడిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో ఎక్కువగా పాటలు, కొన్ని పద్యాలు మొత్తం అన్నీ కలిపి దాదాపు పదహారు వున్నాయి. అందులో "కాదు సుమా కల కాదు సుమా" సూపర్ హిట్. ఆ పాట యొక్క ఆడియో, వీడియో, మరియు సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను.
చిత్రం: కీలుగుఱ్ఱం (1949)
రచన: తాపీ ధర్మారావు నాయుడు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, వక్కలంక సరళ
సరళ: కాదు సుమా కల కాదు సుమా | కాదు సుమా |
అమృత పానమును అమర గానమును | అమృత |
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలిని తేలుచు సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా
ఘంటసాల: ప్రేమలు పూచే సీమల లోపల... | ప్రేమలు |
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తేలియాడుటిది
కాదు సుమా కల కాదు సుమా
సరళ: కన్నె తారకల కలగానముతో | కన్నె తారకల |
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా
ఇద్దరు: పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో | పూల వాసనల |
ఆహహా. ఆ..ఆ ఆహహా. ఆ..ఆ..
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా | కాదు సుమా |
Thank u Sury gaaru, chaala manchi paata vinipinchaaru.
రిప్లయితొలగించండిDear Anonymous, you are welcome sir.
రిప్లయితొలగించండి