1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఎవరో ఎవరో ఈ నవనాటక” అనే ఈ యుగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్., జి.వరలక్ష్మి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
| నిర్మాణం | విజయా వారి | |||
| చిత్రం: | పెళ్ళి చేసి చూడు (1952) | |||
| రచన: | పింగళి నాగేంద్ర రావు | |||
| సంగీతం: | ఘంటసాల | |||
| గానం: | ఘంటసాల, పి.లీల | |||
| దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ | |||
| పల్లవి: | ఘంటసాల: | ఎవరో ఎవరో.. ఈ నవ నాటక సూత్రధారులు.. ఎవరో ఎవరో.. | ||
| లీల: | ఎవరా.. ఎవరా.., ఎవరా.. ఎవరా.. | |||
| మంచి వారు మా మావగారిని వంచన చేసిన దెవరో వారే.. | ||||
| చరణం: | ఘంటసాల: | మనవులుగా అమాయక చూపుల మనసును లాగిలదెవరో | | మనవులుగా | | |
| నిను విడజాల నీదాన నేనని నను నిలవేసినదెవరో | ||||
| ఎవరో వారే | ||||
| చరణం: | లీల: | ప్రియసఖిపై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో | | ప్రియసఖి పై | | |
| న్యాయవాది అన్యాయవాదిఅయి మాయలు నేర్పినదెవరో | ||||
| ఎవరో వారే | ||||
| చరణం: | ఘంటసాల: | హృదయములో విశాల భావం ఉదయము జేసినదెవరో | | హృదయములో | | |
| లీల: | చదువుల సారం సంసారమునకే పదిలము చేసినదెవరో | |||
| ఎవరో వారే | ||||
| ఘంటసాల: | వారే వీరు | |||
| లీల: | వీరే వారు | |||
| ఇద్దరు: | వారే వీరు |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి