1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఓ మనసులోని మనసా” అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
| పల్లవి: | ఓ మనసులోని మనసా ఏమిటె నీ రభస | ||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస | |||
| చరణం: | ఇల్లు అలికిన పండుగటే,ఒళ్ళు తెలిసి మెలగరటె | ||
| ఇల్లు అలికిన పండుగటే,ఒళ్ళు తెలిసి మెలగరటె | |||
| పాలు కాచి చేజేతులొ ఒలకపోసుకుందురటే | |||
| పాలు కాచి చేజేతులొ ఒలకపోసుకుందురటే | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస | |||
| చరణం: | నిజము తెలియనంతవరకే ఆటపాటలెన్నైనా | ||
| నిజము తెలియనంతవరకే ఆటపాటలెన్నైనా | |||
| అసలు రూపుపసిగడితే అధోగతి తప్పునటే | |||
| అసలు రూపుపసిగడితే అధోగతి తప్పునటే | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస | |||
| చరణం: | హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే | ||
| హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే | |||
| జాణతనము చాలింపుము జానవులే నెరజాణవులే | |||
| జాణతనము చాలింపుము జానవులే నెరజాణవులే | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి