సంసారం సమకూర్చుకోవడానికి కనులతో ఏం పని? అనకండి. కనులతో కలలు గని, కలలతో మరులుగొని, మరులు మనసులో స్థిరపడి మనువుగా మారితే సాగే మనుగడకు అర్ధం సంసారం" అని చక్కగా చెప్పారు ఆచార్య ఆత్రేయ. అందుకే మనసు కవి అన్నారు ఆయనను. ఆయన వాడే పదాలు వాడిగ వుంటాయి, ఏమరుపాటుతో ఉంటే ఒక్కొక్క సారి అవి ములుకులులా తగులుతాయి లేదా చెంప ఛెళ్ళు మనిపిస్తాయి, ఆలోచింపజేస్తాయి. ప్రేమదొంగతనాన్ని అంటగట్టిన ప్రేయసిని, తాను ఏమీలేని పేదననే కదా! ఈ నేరాన్ని మోపుతున్నావు అని సమయస్ఫూర్తితో బదులిచ్చే ప్రశ్న-జవాబుల దొంతరలను చక్కని పాటగా సుమంగళి చిత్రం కోసం ఆత్రేయ వ్రాయగా, కె.వి.మహదేవన్ స్వరపరచగా ఘంటసాల, సుశీల అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రానికి మాస్టారు అయిదు పాటలు పాడారు.
చిత్రం: | సుమంగళి (1965) | ||
రచన: | ఆచార్య ఆత్రేయ | ||
సంగీతం: | కె.వి.మహదేవన్ | ||
గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
పల్లవి: | సుశీల: |
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు
ఫలమేమి?
|
|
ఘంటసాల: | కలలే.. | ||
సుశీల: | కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? | ||
ఘంటసాల: | కలలే.. | ||
సుశీల: | నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? | ||
ఘంటసాల: | మరులే.. | ||
సుశీల: | మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? | ||
ఘంటసాల: | మనువు ఊఉ ఊఉ | ||
సుశీల: | మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? | ||
ఘంటసాల: | సంసారం!! | ||
సుశీల: | కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? | ||
ఘంటసాల: | కలలే..ఏఏ ఏ.. | ||
చరణం: | సుశీల: | అల్లరి ఏదో చేసితిని..చల్లగ ఎదనే దోచితివి | |అల్లరి | |
ఘంటసాల: | ఏమీలేని పేదననీ నాపై మోపకు నేరాన్ని | | ఏమీలేని | | |
సుశీల: | లేదు ప్రేమకు పేదరికం.. నే కోరను నిన్ను ఇల్లరికం.. | | లేదు ప్రేమకు | | |
ఘంటసాల: | నింగి నేలకు కడు దూరం.. మన ఇద్దరి కలయిక విడ్డూరం.. | ||
సుశీల: | కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి | ||
ఘంటసాల: | కలలే.. | ||
సుశీల: | నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? | ||
ఘంటసాల: | మరులే.. | ||
సుశీల: | మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? | ||
ఘంటసాల: | మనువు ఊఉ ఊఉ | ||
సుశీల: | మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? | ||
ఘంటసాల: | సంసారం!! | ||
సుశీల: | కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? | ||
ఘంటసాల: | కలలే..ఏఏ ఏ.. |
super song for the people who desires to hear melodies but not to the generation to hear drums only without music.
రిప్లయితొలగించండి