1961 లో హైదరాబాద్ మూవీస్ పతాకం పై నిర్మించబడిన చిత్రం "పెళ్ళి కాని పిల్లలు". చిత్రం లో హరనాథ్, కొంగర జగ్గయ్య, కాంతారావు, జమున నటించారు. నిజ జీవితంలో జమున, జగ్గయ్య ఒకే ఊరివారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రంకోసం ఒక ఏకగళ గీతం, పి.సుశీల తో నాలుగు యుగళ గీతాలు పాడారు. ముఖ్యంగా ఆయన హరనాథ్ కు పాడిని ప్రియతమా రాధికా చాల చక్కని గీతం. దీనిని సంగీత దర్శకులు మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్). ఈయన కుమారుడే సినీ నటుడు భానుచందర్. ఈ పాటను కల్యాణి రాగంలో స్వరపరచారు. ఈ అద్భుత గీతాన్ని వ్రాసినది అభ్యుదయ రచయిత ఆరుద్ర (భాగవతుల సదాశివశంకర శాస్త్రి).
Thanks to Ghantasala Bank (Harish) for uploading this video clip
చిత్రం: | పెళ్ళికాని పిల్లలు (1961) | |
రచన: | ఆరుద్ర | |
సంగీతం: | మాస్టర్ వేణు | |
గానం: | ఘంటసాల | |
పల్లవి: | ప్రియతమా రాధికా, ప్రియతమా రాధికా రావే | |
రయమున కలియవె ప్రేమాభిసారిక | ||
ప్రియతమా రాధికా రావే | ||
రయమున కలియవె ప్రేమాభిసారిక | ||
ప్రియతమా రాధికా | ||
చరణం: | పరువము నీ మేన పరుగులు తీయా ఆ..ఆ..ఆ.. | |
పరువము నీ మేన పరుగులు తీయా | ||
చరణాల కింకిణులు స్వరమేళ పాడా | ||
చరణాల కింకిణులు స్వరమేళ పాడా | ||
ప్రియతమా రాధికా రావే | ||
రయమున కలియవె, ప్రేమాభిసారిక | ||
ప్రియతమా రాధికా | ||
చరణం: | కడవ నిడుకొనీ, కలహంస నడతో | |
విడువని బిడియాన వేమారు వెదకీ | ||
కడవ నిడుకొనీ, కలహంస నడతో | ||
విడువని బిడియాన వేమారు వెదకీ | ||
అడుగులు తడబడ నడుమల్లాడా, ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | ||
అడుగులు తడబడ నడుమల్లాడా | ||
వడి వడిగ నడిచేటి వనితా లలామా | ||
ప్రియతమా రాధికా….రావే | ||
రయమున కలియవె ప్రేమాభిసారిక | ||
ప్రియతమా రాధికా…. | ||
ఆ ఆ ఆ……………………... ప్రియతమా రాధికా | ||
ఆ ఆ ఆ……………………... ప్రియతమా రాధికా | ||
ఆఆఆ ఆఆఆ.. | ||
నిరిరి నిగరిరిమ, గమగ గదమమని | ||
గారిసనిద, సానిదపమ, దాపమగరి | ||
గమదని, గరిసనిదని, గరిగరినిదనిద, | ||
గరిసనిదప, మదపమగరిగరిసని | ||
ప్రియతమా రాధికా రావే, | ||
రయమున కలియవె ప్రేమాభిసారిక | ||
ప్రియతమా రాధికా….ఆ..ఆ..ఆ | ||
ప్రియతమా రాధికా, రాధికా, రాధికా..ఆఆ… |
సూర్యనారాయణ గారు,
రిప్లయితొలగించండిముందుగా మంచిపాట అందించినందుకు చాలా ధన్యవాదాలు.
మీరు పైన "ఘంటసాల మాస్టారు ఈ చిత్రంకోసం ఒక ఏకగళ గీతం, పి.సుశీల తో ఒక యుగళ గీతం" అని వ్రాసేరు. అంటే ఆయన కేవలం రెండు పాటలే ఈ చిత్రం లో పాడేరనా మీ ఉద్దేశ్యం? లేక పొరపాటున మీ వాక్యం మధ్యలో cut అయ్యిందా? ఎందుకంటే, ఈ చిత్రంలో ఆయన మూడు యుగళ గీతాలు, రెండు ఏకగళ గీతాలు పాడేరు. మీకు తెలియదని కాదు, I am clarifying just in case........
రామ ప్రసాద్
రామ ప్రసాద్ గారరు, చక్కగా పట్టుకున్నారు పొరపాటు. మాస్టారు 4 యుగళగీతాలు పాడారు. అయితే ఒకే ఏకగళ గీతం పాడారు. మీ స్పందనకు ధన్యవదాలు.
తొలగించండిఅవునండి, యుగళ గీతాలు నలుగే, మూడు కాదు. నేను "మొన్న నిన్ను చూశాను" పాటను ఏక గళ గీతంగా పరిగణించేను, క్షంతవ్యుణ్ణి.
రిప్లయితొలగించండిit is a fantastic song. haven't heard before. Ghantasala matchless singing.
రిప్లయితొలగించండి