1960 లో జానపద బ్రహ్మ విఠలాచార్య తన స్వంత నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షంసు పతాకం పై నిర్మించిన చిత్రం కనకదుర్గ పూజా మహిమ. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది నాటి నుండి ఇటీవల వరకు తెలుగు చలనచిత్రాలకు మధురమైన బాణీలు కూర్చిన సోదరద్వయం రాజన్-నాగేంద్ర. ఈ చిత్రానికి ఘంటసాల ఒక యుగళ గీతాన్ని, ఒక పద్యాన్ని పాడారు. ఇదివరకు మాస్టారు, శూలమంగళం రాజ్యలక్ష్మి తో పాడిన జీవనమే పావనం పాటను అందించాను. మాస్టారు పాడిన నాతిన్ గానను అనే పద్యాన్ని ఇక్కడ సాహిత్యంతో సహా అందిస్తున్నాను. దురదృష్టవశాత్తు దృశ్య ఖండం లభ్యం కాలేదు. శ్రవణ ఖండం భద్రపరచి అందించిన సఖియా.కాం వారికి ఎనలేని కృతజ్ఞతాంజలులు.
చిత్రం: | కనకదుర్గ పూజా మహిమ (1960) | |
కలం: | జి.కృష్ణమూర్తి | |
స్వరం: | రాజన్-నాగేంద్ర | |
గళం: | ఘంటసాల |
ఆడియో మూలం: సఖియా.కాం
నాతిన్ గానను రాజ్యమూ గనను, కాంతారాన గాసిల్లితిన్ | ||
ఈ తాపమ్ము భరింపజాలనికా..ఆ.. నన్ హింసించి శోధించకే | ||
చేతుల్ మోడిచి చెంపలేసుకుని నే చేసేను నీ సేవలన్ | ||
మాతా!.. మాతా! కనులు వీడెనే దొసగులన్ మన్నించి నన్నేలవే! | ||
నన్నేలవే! నన్నేలవే! |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి