వాల్మీకి రామాయణంలో గుహునిది చక్కని పాత్ర. ఈతడు నిషాధ రాజు. వేటాడడం ఈతని వృత్తి. గుహునికి ఇక్షాకు వంశ ప్రభువైన శ్రీరాముడంటే పంచ ప్రాణాలు. అరణ్య వాసం చేస్తున్న శ్రీరామచంద్రుడు తన రాజ్యం గుండా వెళ్ళబోతున్నాడని విని గుహుడు పరమానంద భరితుడయ్యాడు. రాముని రాకకై వేయి కళ్ళతో ఎదురు చూసాడు. తీరా శ్రీరాముని చూసాక ఏం మాట్లాడాలో తోచలేదు.ఈ సన్నివేశానికి చక్కని పాటను కొసరాజు వ్రాశారు. సందేశాన్ని, సున్నితమైన హాస్యాన్ని పలికించడంలో కొసరాజు ఘనులు. అందరిని - అద్దరిని, దాటలేక - దయజూడగ వంటి చక్కని పదాల ఎన్నిక తో పాటు, రామపాద ధూళి తో రాతి నాతిగా మారింది కదా! మరి నా వావను తాకితే ఏమవుతుందో, అందరిని నావతో దాటించి బ్రతుకుతున్న తనకు అది కాస్త గల్లంతైతే ఏం చేయాలో, అందుకే ముందు నీ కాళ్ళు కడగనియ్యి తండ్రీ అని గుహుని పరంగా అతిశయోక్తిని కొసరాజు సునిశితంగా పాటలో ఇమిడించారు.హనుమంతుని పాత్రను పోషించడంలో దిట్టయైన అర్జా జనార్ధన రావు గుహునిగా నటించాడు. రామునిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ నటించిన 'సంపూర్ణ రామాయణం' చిత్రం బాపు రూపకల్పన లో అపురూపంగా నిలిచింది. మామ మహదేవన్ కూర్చిన "రామయ తండ్రి" పాటను పాటను ఘంటసాల మధురంగా ఆలపించారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు!
Thanks to IDreamNetWorks for posting the video to You Tube
ఆడియో మూలం: వీడియో నుండి
చిత్రం: | సంపూర్ణ రామాయణం (1972) | ||
రచన: | కొసరాజు రాఘవయ్య చౌదరి | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు, బృందం | ||
సంగీతం: | కె.వి.మహదేవన్ | ||
దర్శకత్వం: | బాపు | ||
పల్లవి: | ఘంటసాల: | రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి | |
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి | |||
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి | | రామయ | | ||
చరణం: | ఘంటసాల: | తాటకిని ఒక్కేటున కూల్చావంటా! | |
శివుని విల్లు ఒక దెబ్బకె యిరిశావంట! | | తాటకిని | | ||
పరశురాముడంత వోడ్ని పారదరిమినావంట | |||
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్ళు మరిచిపోతుంట | |||
బృందం: | రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి | ||
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి | |||
ఘంటసాల: | మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి | ||
వచనం: | ఘంటసాల: | ఆగు బాబూ! ఆగు | |
చరణం: | అయ్యా నే వస్తుండా, బాబూ నే వస్తుండా | | అయ్యా నే | | |
నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట | |||
నాకు తెలుసులే.. | |||
నా నావమీద కాలుబెడితె ఏమౌతాదో తంట | | నీ కాలు | | ||
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట | |||
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట | |||
బృందం: | రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి | ||
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి | |||
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి | |||
చరణం: | ఘంటసాల: | అందరినీ దరిజేర్చు మారాజువే | |
అద్దరిని జేర్చమని అడుగుతుండావే | | అందరినీ | | ||
నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి | | నువ్వు దాటలేక | | ||
నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రీ | |||
బృందం: | హైలేసా లేలో హైలేసా! - 5 (జోరుగ) | ||
ఘంటసాల: | హైలేసా లేలో హైలేసా! -2 (నెమ్మదిగా) | ||
ఓహోహో! ఓ!..ఓ… | |||
బృందం: | హైలేసా లేలో హైలేసా! -6 |
శ్రీ రామ నవమి సందర్భంగా చక్కటి గీతాన్ని అందించారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచరణం పవిత్రం వితతం పురాణం
రిప్లయితొలగించండియేన పూత స్తరతి దుష్కృతాని
తేన పవిత్రేణ శుద్ధేన పూతాః
అతి పాప్మాన మరాతిం తరేమ
లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం
జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్
అమృతస్య ధారా బహుధా దోహమానం
చరణం నో లోకే సుధితాం దధాతు
పై మంత్రార్థస్మరణం కొసరాజు గారి ఈ చరణం లోని అంశం
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట