ప్రేయసీ ప్రియుల మమతానురాగాలు గువ్వల జంటలా, నవ్వుల పంటలా విరజాజుల పరిమళపు స్వాగతంతో మనసులనుల్లాస పరుస్తాయి. తొలిప్రేమలోని తీపి గురుతులు మనసుకు హత్తుకుని కూరిమి తలపులను వారెప్పుడూ నెమరు వేసుకుంటుంటారు. ఈ భావాలను సుమధురంగా ఆరుద్ర 1964 లో విడుదలైన 'దేశ ద్రోహులు' చిత్రంలో "జగమే మారినది మధురముగా ఈ వేళ" గీతంలో ఆవిష్కరించారు. అయితే మనము తరచూ వినే మాస్టారి ఏకగళ గీతం సినిమాలో పియానో వాయిస్తూ కథానాయకుడు తను ప్రేమించి, మరొకరి ఇల్లాలైన తన ప్రేయసి ఎదుటపడినపుడు పాడిన పాట. అతను పడే బాధ రెండవ చరణంలో 'కమ్మని భావమే కన్నీరై నిండెనూ' అంటూ ప్రకటిస్తాడు. అయితే ఇదే పాట యుగళ గీతంగా చిత్రం పూర్వ భాగంలో "ఎదలో యింతటి సంతోషమెందుకో" అని పలుకుతాడు. ఒకే భావం, పరిస్థితుల ప్రభావానికి లోనైనపుడు ఉద్వేగంతో ఆశాజనకమైన యుగళగీతం ఎలా నిరాశ నిండిన ఏకగళ గీతంగా మారుతుందో, రెండు వేర్వేరు సన్నివేశాలలో చిత్రీకరించబడిన, ఆరుద్ర కలం నుండి జాలువారిన ఈ గీతం చెబుతుంది. ఈ విభిన్న రసాలకు అద్భుతమైన బాణీని కళ్యాణి రాగంలో రసాలూరు రాజేశ్వర రావు అందించారు. ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు, దేవిక, కాంతారావు, శోభన్‌బాబు, జానకి నటించారు. ఈ పాట(ల), శ్రవణ, దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను. వి(క)ని ఆనందించగలరు.
యుగళ గీతం
Thanks to Srini Dasri for up loading the video to You Tube
ఏకగళ గీతం
యుగళ గీతం: ఘంటసాల-పి.సుశీల | ఏకగళ గీతం: ఘంటసాల | ||||
ఆలాపన: | సుశీల: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ | పల్లవి: | ఘంటసాల: | జగమే మారినది మధురముగా ఈ వేళ |
పల్లవి: | సుశీల: | జగమే మారినది మధురముగా ఈ వేళ -2 | జగమే మారినదీ మధురముగా ఈ వేళ | ||
కలలూ కోరికలు తీరినవి మనసారా | కలలూ కోరికలు తీరినవి మనసారా.ఆ | ||||
జగమే మారినది మధురముగా ఈ వేళ | జగమేమారినది మధురముగా ఈ వేళ | ||||
చరణం: | సుశీల: | మనసాడెనే మయూరమై పావురములు పాడే | చరణం: | ఘంటసాల: | మనసాడెనే మయూరమై పావురములు పాడే |
ఎల పావురములు పాడే | ఎల పావురములు పాడే | ||||
మనసాడెనే మయూరమై పావురములు పాడే | ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత | ||||
ఎల పావురములు పాడే | అవి అందాల జంట | ||||
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత | నెనరూ కూరిమీ ఈనాడే పండెను -2 | ||||
అవి అందాల జంట | జీవితమంతా చిత్రమైన పులకింత | ||||
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత | జగమే మారినది మధురముగా ఈ వేళ | ||||
అవి అందాల జంట | కలలూ కోరికలు తీరినవి మనసారా.ఆ | ||||
నెనరూ కూరిమీ ఈనాడే పండెను -2 | జగమే మారినది మధురముగా ఈ వేళ | ||||
జీవితమంతా చిత్రమైన పులకింత | చరణం: | ఘంటసాల: | విరజాజుల సువాసన స్వాగతములు పలుక | ||
జగమే మారినది మధురముగా ఈ వేళ | సుస్వాగతములు పలుకా | ||||
కలలూ కోరికలు తీరినవి మనసారా | ఆ ఆ..ఆ..ఆ..ఆ. ఆ… | ||||
జగమే మారినది మధురముగా ఈ వేళ | విరజాజుల సువాసన స్వాగతములు పలుక | ||||
చరణం: | సుశీల: | విరజాజుల సువాసన స్వాగతములు పలుక | సుస్వాగతములు పలుకా | ||
సుస్వాగతములు పలుకా | తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి | ||||
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి | అనురాగాల తేలి | ||||
అనురాగాల తేలి | కమ్మని భావమే కన్నీరై చిందెను - 2 | ||||
ఘంటసాల: | ఎదలో ఇంతటి సంతోషమెందుకో -2 | ప్రియమధు చెలిమి సాటిలేని కలిమీ..ఈ.ఈ. | |||
ఎవ్వరికోసమో ఎందుకింత పరవశము | జగమే మారినది మధురముగా ఈ వేళ | ||||
జగమే మారినది మధురముగా ఈ వేళ | కలలూ కోరికలు తీరినవి మనసారా.ఆ | ||||
సుశీల: | కలలూ కోరికలు తీరినవి మనసారా | జగమే మారినది మధురముగా ఈ వేళ | |||
ఇద్దరు: | జగమే మారినది మధురముగా ఈ వేళ |
దేస ద్రోహులు చిత్రం కోసం ఆరుద్ర గారు రచించిన ఈ మధుర గీతం రెండు వేరు వేరు సందర్భాలలో సాలూరి వారు సంగీతం సమకూర్చగా ఒకటి ఘంటసాల మాస్టారు, సుశీల గారు కలసి యుగళ గీతం గాను, ఇంకొకటి ఘంటసాల మాస్టారు ఏకగళ గీతం గాను పాడిన వైనాన్ని చక్కగా ద్రుశ్య, శ్రవణ సాహిత్యాలను ఒకే చోట చేర్చి మీ విశ్లేషించిన తీరు బాగుంది. సూర్యనారాయణ గారూ, మీకు నా అభినందననలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు అచ్యుతప్రసాద్ గారు.
తొలగించండిWonderful experiment. In the duet "ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశము" and in solo "కమ్మని భావమే కన్నీరై చిందెను" are wonderful expressions by Great Arudra equally great in Ghantasla Mastaru't tone. Thanks for posting a very good song.
రిప్లయితొలగించండి