1965 లో విజయా వారు నిర్మించిన సత్య హరిశ్చంద్ర చిత్రంలో హరిశ్చంద్రునిగా ఎన్.టి.ఆర్., చంద్రమతి గా ఎస్.వరలక్ష్మి నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు పెండ్యాల గారు. ఘంటసాల ఈ చిత్రానికి ఎన్నో పద్యాలు మరియు పాటలు పాడారు. అందులో హరిశ్చంద్రుడు కుటుంబ సమేతంగా పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ శివుని ప్రస్తుతిస్తూ గానం చేసిన శ్లోకం "వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితం". నీలలోహితం అంటే చిక్కని నీలి రంగు (violet). (అతి నీలలోహితానికి అనువాదం ultraviolet.) హాలాహలాన్ని దిగమింగే ప్రయత్నంలో శివునికి గరళం గళంలో అడ్డుపడి ఆ భాగం ముదురు నీలి రంగుగా మారుతుంది. అందుకే నీల కంఠుడు అని అంటాం. హరిశ్చంద్రుని కుమారుని పేరు లోహితాస్యుడు. ఈ శ్లోకం ఈ సన్నివేశానికి ఎన్నుకోవడం లో ఆ పేరు కూడ స్ఫురిస్తుంది. అయితే ఈ శ్లోకానికి మూలం శివవిష్ణు స్తోత్రములు కావచ్చును. శివునికి నమస్కరిస్తూ బాణాసురుడు ఈ శ్లోకం చెప్పినట్లుగా కొన్ని వివరాలు కంచి కామకోటి వారి వెబ్ సైటులో చూడగలరు.
తాత్పర్యము*:
దేవతలలో శ్రేష్ఠుడు, దేవతలకు ఈశ్వరుడు, యోగీశ్వరుడు, యోగములకు కారణభూతుడు, యోగులకు, గురువులకు గురువైన ఆ మహాదేవుని నమస్కరింతును.
అతడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానరూపి, జ్ఞాన కారణము, సనాతనుడు, తపః ఫలితములనిచ్చువాడు, సమస్త సంపదలనిచ్చువాడు, తపః స్వరూపుడు, తపస్సు చేయుటకు కారణమైనవాడు, తపోధనులనే ధనముగా భావించువాడు, అట్టి శంకరుని నమస్కరింతును.
*ఈ తాత్పర్యము కంచి కామకోటి వెబ్ సైట్ నుండి గ్రహించబడినది.
ఆడియో మూలం: వీడియో నుంచి
వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితం | | |||
యోగీశ్వరం యోగ బీజం యోగినాం చ గురోర్గురుమ్ || | |||
ఙ్ఞానానందం ఙ్ఞాన రూపం (ఙ్ఞాన బీజం) సనాతనం | | |||
తపసాం ఫలదాతారం దాతారం సర్వ సంపదామ్ || |
తాత్పర్యము*:
దేవతలలో శ్రేష్ఠుడు, దేవతలకు ఈశ్వరుడు, యోగీశ్వరుడు, యోగములకు కారణభూతుడు, యోగులకు, గురువులకు గురువైన ఆ మహాదేవుని నమస్కరింతును.
అతడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానరూపి, జ్ఞాన కారణము, సనాతనుడు, తపః ఫలితములనిచ్చువాడు, సమస్త సంపదలనిచ్చువాడు, తపః స్వరూపుడు, తపస్సు చేయుటకు కారణమైనవాడు, తపోధనులనే ధనముగా భావించువాడు, అట్టి శంకరుని నమస్కరింతును.
*ఈ తాత్పర్యము కంచి కామకోటి వెబ్ సైట్ నుండి గ్రహించబడినది.
Thanks for posting a good padyam
రిప్లయితొలగించండి