బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా ఎందుకూ పనికిరావన్నారు మనవాళ్ళు. అందువలన, మగ పిల్లవాడు ఒక ఇంటివాడు ఎప్పుడవుతాడా అని కొందరు తలిదండ్రుల ఆరాటం. అదే కూతురు అయితే, పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్ల గుండెల మీద కుంపటి, అది ఎప్పుడు దింపుకుంటామో అని ఆడపిల్లను కన్నవారికి ఆందోళన, ఆదుర్దా. కాని పెళ్ళి మాట వచ్చేసరికి ఎవరి ఆలోచనలు వారివి. కట్నాలు, కానుకలు ఏమిటని మగ పెళ్ళివారికి చర్చ అయితే, అవి ఎలా సమకూర్చాలని ఆడపెళ్ళివారికి సమస్య అవుతుంది. ఆ రోజుల్లోనే వరకట్నం నివారించాలని పలువురి సూచన. అఫ్ కోర్స్ ఆడపిల్లల తల్లిదండ్రులకనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఒక మగ మహారాజు (ఎన్.టి.ఆర్.) నడుం కట్టి, ముందుకొచ్చి, తన స్వానుభవాన్ని సందేశ రూపంలో తెలియజెప్పె చక్కని సన్నివేశం "పెళ్ళి చేసి చూడు" చిత్రంలోని టైటిల్ సాంగ్. మాస్టారు ఈ పెళ్లి పాటను కల్యాణి రాగంలో స్వర పరచి, సున్నితంగా, సుమధురంగా పాడి అజరామరం చేశారు. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కట్న, కానుకల ప్రసక్తి, చర్చ వచ్చినపుడు ఈ పాటను గుర్తు తెచ్చుకోనివారుండరు. ఈ పాట రచన పింగళి. విజయా సంస్థ నిర్మించిన విజయవంతమైన ఈ చిత్రానికి దర్శకులు ఎల్.వి.ప్రసాద్.
చిత్రం: | పెళ్ళి చేసి చూడు (1952) | ||
రచన: | పింగళి నాగేంద్ర రావు | ||
సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
సాకీ: | ఓ! భావి భారత భాగ్య విధాతలారా! | ||
యువతీ యువకులారా… | |||
స్వానుభవమ్మున చాటు నా సందేశమిదే.. | |||
వారెవ్వా! తా ధిన్న తకధిన్న తాంగిడు తకధిమి తో | |||
పల్లవి: | పెళ్ళి చేసుకుని యిల్లు చూసుకుని | ||
చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖము చూడాలోయ్ | |||
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ | |||
సాకీ: | కట్నాల మోజులో తమ జీవితాలనే బలిచేసి | ||
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి గాక! | |||
పట్నాల, పల్లెల దేశ దేశాల తమ పేరు చెప్పుకుని | |||
ప్రజలు సుఖపడగా.. | |||
చరణం: | ఇంటా, బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్ | ||
తరంపం | | ఇంటా బయటా | | ||
కంటిపాపలై దంపతులెపుడూ చంటిపాపలను సాకాలోయ్ | | కంటి పాపలై | | ||
పెళ్ళి చేసుకుని.. | |||
పెళ్ళి చేసుకుని యిల్లు చూసుకుని | |||
చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖము చూడాలోయ్ | |||
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ | |||
సాకీ: | నవ భావములా.. నవ రాగములా.. ఆ..ఆ..ఆ… | ||
నవ జీవనమే నడపాలోయ్ | |||
చరణం: | నవ భావములా నవ రాగములా నవ జీవనమే నడపాలోయ్ | ||
భావ కవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ | | భావ కవుల | | ||
తా ధిన్నా తకధిన్నా తాంగిడతక తథిగిణ తోం |
"పెళ్ళి చేసి చూడు" చిత్రంలోని టైటిల్ సాంగ్ మాకు పరిచయం చేస్తూ పాటతో పాటుగా సాహిత్యం, వీడియొ, ఆడియొలను తదితర వివరాలను అందించడం ఏలోటు లేకుండా పూర్తిగా వడ్డించనట్లుంది.ప్రత్యేకంగా చెప్పుకోదలిస్తే ఈ పాటలో మాంచి జోష్ కనిపిస్తుంది.ఓ మంచి పాటను వినిపించినందుకు ధన్యవాదములు.-రామకృష్ణ, తిరుపతి
రిప్లయితొలగించండిధన్యవాదములు రామకృష్ణ గారు.
తొలగించండిThanks for posting a wonderful song. There are many more good songs of Ghantasala Mastaru. But this song is having that "Dammu". - subbarao
రిప్లయితొలగించండిThanks for posting a wonderful song. There are many more good songs of Ghantasala Mastaru. But this song is having that "Dammu". - subbarao
రిప్లయితొలగించండి