మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో గల పండరిపుర క్షేత్రానికి సమీపంలో నివసించే ఒక కృష్ణ భక్తురాలు సక్కుబాయి. పాండురంగ విఠలుడు కొలువున్న పండరిపుర క్షేత్రం భీమానది ఒడ్డున వుండి. ఈ ప్రాంతంలో ఈ నది అర్ధ చంద్రాకారంలో వుంటుంది, అందువలన దీన్నే 'చంద్రభాగ' నది అంటారు. ఇక్కడకు శిరిడీ దగ్గరే. శిరిడి సాయినాథుని సాయంకాల ఆరతిలో 'శుద్ధ భక్తి చంద్రబాగా యావ పుండలీక జాగా' అని సూచించేవి ఈ నది, ఈ క్షేత్రం గురించే. కృష్ణ భక్తురాలైన సక్కుబాయి కథను చిత్రంగా చిన్ని బ్రదర్స్ (అంజలీ పిక్చర్సు) పతాకం పై అంజలీదేవి కథానాయిక పాత్రలో సతీ సక్కుబాయి చిత్రాన్ని 1965 లో నిర్మించారు. విఠోబా భక్తిలో మునిగి తేలుతున్న సక్కుబాయి కారణజన్మురాలని గ్రహించిన మాధవస్వామి అనే సాధుపుంగవుడు (గుమ్మడి) ఆమెను పాండురంగ విఠలుని అనుగ్రహం పొందగలవని ఆశీర్వదిస్తాడు. అతనిని గురువుగా ఆశ్రయించి తనకు మోక్షమార్గం తెలియజేయమంటుంది సక్కుబాయి. ఆమెకు కృష్ణుని విగ్రహం ఇచ్చి ఆరాధించమని ఉపదేశిస్తాడు మాధవస్వామి. అత్త (సూర్యకాంతం), ఆడపడుచు (గిరిజ) తనను చిత్రహింసలు పెడుతున్నా, ఓర్చుకుని పాండురంగ విఠలునే నమ్ముకుంటుంది సక్కుబాయి. వైకుంఠం ను పండరి తోను, విరజానదిని చంద్రభాగ తోను, విష్ణువును పాండురంగనితో పోలుస్తూ, మాధవస్వామి తన శిష్యులకు భవబంధాలను, ఐహిక సుఖాలను త్యజించమని బోధించే పాటను ఘంటసాల మాస్టారు మధురాతి మధురంగా పాడారు. ఆ పాటను ఈ పోస్టులో పొందుపరుస్తున్నాను. ఈ చిత్రంలో పి.సుశీల అద్భుతమైన ఏకగళ గీతాలు (ఉదా.జయ పాండురంగ ప్రభో విఠలా), మాస్టారు పాడిన మరొక పాట (రంగా రంగా రంగాయనండి), రెండు పద్యాలు కూడ వున్నాయి. అంజలీదేవి భర్త పి.ఆది నారాయణ రావు సంగీత దర్శకులు. గీత రచన సముద్రాల రాఘవాచార్య, దర్శకత్వం వేదాంతం రాఘవయ్య. సక్కుబాయి భర్తగా ఎస్.వి.రంగారావు, ఆడపడుచు భర్తగా రేలంగి, శ్రీకృష్ణునిగా కాంతారావు నటించారు.
కృతజ్ఞతలు: సమాచారము పొందుపరచిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి మరియు వికిపీడియా బ్లాగులకు, యూ ట్యూబ్ వీడియో పొందుపరచిన MangoMusic వారికి కృతజ్ఞతలు.
చిత్రం: | సతీ సక్కుబాయి (1965) | ||
రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
సంగీతం: | పి.ఆదినారాయణ రావు | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
పల్లవి: | ఐహిక సుఖము క్షణికము సుమ్మా | ||
హరి సంకీర్తన సేయుమా | | ఐహిక | | ||
నందనందనుని పొందున దొరకే | |||
ఆనందము యిల లేదు సుమా! | | నంద | | ||
ఐహిక సుఖము క్షణికము సుమ్మా | |||
హరి సంకీర్తన సేయుమా | |||
చరణం: | విరజా నది ఆ చంద్రభాగయే | ||
పరంధాముడా పాండు రంగడే | |||
విరజా నది ఆ చంద్రభాగయే | |||
పరంధాముడా పాండు రంగడే | |||
జనన, మరణ భయరహితంబైన | |||
శ్రీ వైకుంఠము పండరియే | |||
ఐహిక సుఖము క్షణికము సుమ్మా | |||
హరి సంకీర్తన సేయుమా | |||
ఐహిక సుఖము క్షణికము సుమ్మా |
కృతజ్ఞతలు: సమాచారము పొందుపరచిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి మరియు వికిపీడియా బ్లాగులకు, యూ ట్యూబ్ వీడియో పొందుపరచిన MangoMusic వారికి కృతజ్ఞతలు.
మధుర గాయకుడు ఘంటసాల గారి గళ మాధుర్యాన్ని ఈ పాటలో ఒలికించారు. ఇంత అపురూపమైన పాటని మీ బ్లాగ్ ద్వారా అందించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిప్రసాద్ అచ్యుత్.
ప్రసాద్ గారు, సంతోషం. ధన్యవాదాలు.
తొలగించండిThanks for posting wonderful song
రిప్లయితొలగించండిGhantasala gari gontulo amrutam
రిప్లయితొలగించండి