"సంసారం" 1950 లో విడుదలైన సంసార పక్షమైన కుటుంబ కథా చిత్రం. ఇందులో అగ్రనటులు ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్. యిద్దరూ నటించారు. అరవై ఒక్క సంవత్సరాల క్రితం పల్లెటూర్లు, పట్టణాల మధ్య రాకపోకలు, పట్నం చదువులు చదివే దొరబిడ్డలు చదువులేని అమాయక పల్లె ప్రజలను చూసి చేసే చీదరింపులు, దానికి ప్రతిగా పల్లెటూరి వాళ్ళు చేసే ఈసడింపులు, ఎత్తిపొడుపులు, ఈ నేపధ్యంలో నాయికా నాయకులమీద చిత్రించిన పాట ఇది. "పట్నపోళ్ళు ఎంగిలి పీసు (english) లో మాట్టాడుతారట గందా!" అని అబ్బురపడే గ్రామీణులు, "పల్లెటూరిబైతులు నాటుబళ్ళలో వెళతారు" అనుకునే సదరు పట్టణపు నాగరీకులు, వీరి మధ్య జరిగిన వెటకారంతో కూడిన సంభాషణను ఒక చక్కని పాటగా రూపకల్పన చేసారు శ్రీ సదాశివ బ్రహ్మం గారు. "టకు టకు టకు టకు టమకుల బండి" అని ఎద్దులబండిని, జెర్రిపోతులాగ దూసుకుపోయే కారుని వర్ణించారు. అంతేకాక, ఊరికే మరమ్మత్తుకు వచ్చే డబ్బాకారుని "మేకు జారితే తోక పీకుడే" అని చక్కగా వర్ణించారు. స్వర బ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాస్టారు రెండు సోలోలు, ఒక పద్యం, ఒక యుగళ గీతం పాడారు. ఇక్కడ ఘంటసాల మాస్టారు, జిక్కి (కృష్ణవేణి), బృందం పాడిన ఈ పాట శ్రవణం, సాహిత్యం పొందు పరుస్తున్నాను. తెలుగు వీడియో లభ్యం కాక పోవడం వలన సంసారం హిందీ చిత్రం లోని దృశ్యానికి తెలుగు పాటను డబ్ చేసి ఇక్కడ పొందుపరచారు శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు. వారికి అభినందనలు.
రచన: సదాశివ బ్రహ్మం
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గానం: ఘంటసాల, జిక్కి, బృందం
జిక్కి: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, ఎద్దుల బండి, జోడెద్దుల బండి
బృందం: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, యెద్దుల బండి
జోడెద్దుల బండి, చల్ చల్ చల్
జిక్కి: నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
బృందం: నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
బృందం: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి
ఘంటసాల: పాం పాం
తుర్రుబుర్రు తుర్రుబుర్రు మోటరు కారు
జెర్రిపోతులాగ దొర్లిపోయావె కార | తుర్రు బుర్రు |
జిక్కి: కదలదు మెదలదు రధమండి, కూచున్నాడు విగ్రహమండి
బృందం: కదలదు మెదలదు రధమండి, కూచున్నాడు విగ్రహమండి
చల్ చల్ చల్
జిక్కి: నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
బృందం: నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి
ఘంటసాల: పాం పాం
తినేది గాలి మేసేది నూనె తిరకాసే...ఏ.. | తినేది గాలి |
మేకు జారితే తోక పీకుడే | మేకు జారితే |
తస్సదియ్య దొరబిడ్డ ఎంగిలిపీసె,
బుసబుస రొసలూ యెందుకే | తస్సదియ్య |
బుసబుస రొసలూ యెందుకే | తస్సదియ్య |
బృందం: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి