1959 లో అలనాటి ప్రముఖ సినీ నటి లక్ష్మీ రాజ్యం యొక్క స్వంత నిర్మాణ సంస్థ అయిన రాజ్యం పిక్చర్సు పతాకం పై ఎస్.వి.రంగారావు, లక్ష్మీ రాజ్యం నటించిన చిత్రం కృష్ణ లీలలు. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు. ఘంటసాల మాస్టారు మూడు పద్యాలు, ఒక బృంద గీతం పాడారు. ఇక్కడ సదాశివ బ్రహ్మం వ్రాసిన పద్యం పొందు పరుస్తున్నాను. ఈ పద్యంలో శ్రీకృష్ణుడు తనకు బావ అయిన ధర్మరాజుతో అన్న పద్యమిది. ఈ భూమినుండి పరిపాలించిన రాజులలో నిత్య సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడు ఈ భూమిని వదిలి వెళ్ళలేదా!, అన్ని లోకాలు పాలించిన నలుడు తన వెంట భూమిని తీసుకు పోగాలిగేడా!, కృత యుగానికే అలంకారమైన మాంధాత (ఇక్ష్వాకు వంశీయుడు) ఐశ్వర్యాన్ని తనతో తీసుకొని పోగలిగేడా!, త్రేతాయుగ పురుషుడైన శ్రీరాముడు అసలిప్పుడీ భూమి పై వున్నాడా! ఓ! బావా! ఎందఱో రాజులు వచ్చారు, పోయారు గాని ఈ భూతలం నుండి ఏమీ తీసుకుని పోలేదు. నువ్వు మాత్రం ఎలా ఈ రాజ్యాన్ని గాని, సంపదను గాని నీ నెత్తికి కట్టుకుని వెళ్ళ గలవు?" అని దీని తాత్పర్యం.
చిత్రం: కృష్ణ లీలలు (1959)
రచన: సదాశివ బ్రహ్మం చిత్రం: కృష్ణ లీలలు (1959)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి
గానం: ఘంటసాల
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
నిరత సత్య ప్రౌఢి ధరణినేలిన హరిశ్చంద్రుడీ ధరబాసి చనగలేదె
ఎల్ల లోకములేలి యెసగు శ్రీనలరాజు తనవెంట భూమిని గొనుచు చనెనే
కృత యుగంబునకు అలంకృతిజేయు మాంధాత సిరిమూట గట్టుక నరుగ గనెనే
జలధి అలరారు శ్రీరాముడు వుర్విపై యిప్పుడు ఉన్నవాడె
ఎందరెందరొ రాజులు ఏగినారు!
బావా..
ఎందరెందరో రాజులు ఏగినారు
బావా..
ఎందరెందరో రాజులు ఏగినారు
ఒక్కరును వెంట గొనిపోవరుర్వితలము
నీవు మాత్రము రాజ్యంబు నీదు సిరియు
తలను కట్టుక పోదువో ధర్మ హృదయా ఆ..ఆ..ఆ..
Very fine poems of Ghantasala
రిప్లయితొలగించండిRadharao
Radharao garu, thanks.
రిప్లయితొలగించండిదేవకి భర్త వసుదేవుడు కంసుడితో అన్న మాటలివి, ఆకాశవాణి పలుకులు విని కంసుడు దేవకిని చంపబోయినప్పుడు..సినిమాలో శ్రీరంజని (జూనియర్), గుమ్మడి, ఎస్ వి ఆర్ నటించారు.
రిప్లయితొలగించండి