మార్క్ ట్వైన్ రచించిన ఆంగ్ల నవల "ది ప్రిన్స్ ఎండ్ ది పాపర్" ఆధారంగా 1954 లో నిర్మించబడిన చిత్రం "రాజు-పేద". ఒకేపోలిక ఉన్నఇద్దరు పిల్లలు (బహుశా బాల నటుడు సుధాకర్ అనుకుంటాను), ఒకరు మహారాజు (ఎస్.వి.ఆర్) కొడుకు, మరొకరు ఒక పేదవాడు అయిన పోలిగాడి (ఎన్.టి.ఆర్) కొడుకుల మధ్య జరిగిన కథ ఈ చిత్రం. ఇందులో ప్రముఖ పాత్ర (సుధీర్) వహించిన రేలంగి తన తాత ముత్తాతల కాలం నుండి వచ్చిన ఒక బొమ్మను ఎప్పుడూ జేబులో ఉంచుకుంటాడు. అది ఉన్నంత సేపు అతనిని ఎవరు జయించలేరు. సుదీర్ కు, పోలిగాడి కూతురు మల్లి అంటే చాల ఇష్టం. రేలంగికి ఘంటసాల మాస్టారు పాడిన పాట "జేబులో బొమ్మ! జేజేల బొమ్మ" బహుళ ప్రచారం పొందింది. ఇదే చిత్రంలో జిక్కి (కృష్ణవేణి) పాడిన "కళ్ళు తెరచి కనరా! సత్యం ఒళ్ళు మరచి వినరా" అనేది ఇంకో సూపర్ హిట్ పాట. ఈ చిత్రంలో "పోలిగాడు" పాత్రలో నటించిన ఎన్.టి.ఆర్. కు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఈ పాట సాహిత్యం, ఆడియో, వీడియో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చిత్రం: రాజు-పేద (1954)
రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
సంగీతం: ర'సాలూరు' రాజేశ్వరరావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
సాకీ: జేజేలను వినీ గొప్పవారమనీ
చెడ్డపనుల మాచేత చేయింపకుమా
ఆ..ఆ..ఆ..
ప. హేయ్!
జేబులో బొమ్మ (2)
జేజేల బొమ్మ
జేబులో బొమ్మ జేజేల బొమ్మ
జేబులో బొమ్మ
మొక్కిన మొక్కులు చల్లంగుండీ | మొక్కిన |
ఎనక్కి తిరక్క గెలుస్తువుంటే
భక్తి తోడ నీ విగ్రహానికి
బంగరు తొడుగే ఇంచుదునమ్మా | జేబులో |
చ. కనక తప్పెటలు ఘణఘణ మ్రోయగ
శంఖ నాదములు శివమెత్తించగ | కనక |
చేసిన తప్పులు చిత్తయిపోవగ
చేతులెత్తి ప్రార్థించెదనమ్మా | జేబులో |
చ. మారాజులకు మనసులు మారి
మంత్రి పదవి నా తలపైకొస్తే.. | మారాజులకు |
వేడుక దీరగ పూత కూర్పుతో
జోడు ప్రభల కట్టించెదనమ్మా
చ. మా యిలవేల్పుగ మహిమలు జూపి
మల్లికి నాకు మనసు గల్పితే
హు. బొమ్మా!
తకిట తథిగిణ తకథై అంటూ
చెక్క భజన చేయించెదనమ్మా
జేబులో బొమ్మా జేజేలా బొమ్మా (2)
జేబులో.. జేబులో.. జేబులో బొమ్మ
Relangi did just superb. Every bit of song denotes the latent truth in it. Thanks for letting this opportunity that make us listen to old/gold songs. Today's shows are nothing but just nonsensical and I was watching a show, by the way, I just got hooked to roku,for my mother-in-law, that shows all movie actors to the Game to collect money. I wonder, why on earth they do not give opportunity to the nation's poor and needy. Why only Movie Actors? Do they still in this 21st era need to suffer. I realized that is India. I beg to TV Stations not to entertain these movie clowns, just give solid opportunity to nation's Poor and Needy, and esply from rural and farming community. Please.
రిప్లయితొలగించండిkishen c.rao/venky-villa, winterville, nc, USA.
ps; God bless!!!
Thanks Kishen garu for your response.
రిప్లయితొలగించండి