గీత రచన: తోలేటి
గానం, స్వర రచన: ఘంటసాల
తెన్గు భారత కృతిన్ తీర్చిదిద్దిన
కవిత్రయ ఘంటముల నాట్య రమ్య రవళి | తెన్గు |
మందార మకరంద మందించు
బమ్మెర మేటి వాక్యాల పన్నీటి ధార
ఢంకా బజాయించి శింకాన నిల్చిన
శ్రీనాథు కావ్యాల జిలుగు వెలుగు | ఢంకా |
మధుర శిల్ప విచిత్ర మనుచరిత్రము గన్న
అల్లసాని వారి అందెల సవాలు
ఉయ్యాలలో తన వయ్యారిచే పంత
మొలికించు పింగళి పలుకు తీరు
కలసి నీ చేతి కలముతో గంతులాడి
తెన్గు గుండియలందున తేలియాడు
దివ్య మాధుర్య కైదలందించినావు
మరణమెరుగని కవికుల మండలమున
వెలుగు రారాజ చెళ్ళపల్లి వేంకటార్య
ఆంధ్రులందించు జోహారులందవయ్యా
ఆ..ఆ..ఆ...
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో - శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో - శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు
చాలా బావుందండీ...thanks a lot!
రిప్లయితొలగించండిసౌమ్య గారు, ధన్యవాదాలు
రిప్లయితొలగించండిadbhutam sir.
రిప్లయితొలగించండిadbhutam sir. chala bagundi.
రిప్లయితొలగించండిThanks Murali Krishna garu. Sorry, I missed your comment.
తొలగించండిభాషాభిమానాన్ని వ్యక్త పరచిన ఈ మీ కవిత అద్బుతము
రిప్లయితొలగించండిamdaru andhrollena, maa telaganolleri? kcr,ktr,kavitha,hareesh,eetela ,kodandaraam
రిప్లయితొలగించండిandaru seemaandrollena, maa telanganollu oamkkallu guda lera? kcr,ktr,kavitha,hareeshrao,kodandaramreddy
రిప్లయితొలగించండి