భాగ్యరేఖ చిత్రం 1957 లో విడుదల అయింది. ఈ చిత్రంలో పద్యాలు, పాటలు కలిపి దాదాపు 16 వరకు ఉన్నాయి. పాటలలో శ్రీ కొసరాజు గారు రెండు, శ్రీ ఆది శేషా రెడ్డి గారోకటి, తతిమ్మావి వ్రాసినది శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఇందులో అందరికీ తెలిసిన ప్రసిద్ధి చెందినా పాత శ్రీమతి పి. సుశీల పాడిన "నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై". అందులో ఘంటసాల మాస్టారు పాడిన ఒకే ఒక శ్లోకం "కలడందురు దీనుల పాలిట". ఇదే పద్యం శ్రీ కే. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించ "సిరిసిరి మువ్వ" చిత్రంలో "రా దిగిరా దివి నుంచి భువికి దిగి రా" పాటకు సాకీ గా శ్రీ బాలు పాడారు.
"భాగ్యరేఖ" చిత్రం వివరాలు క్రింది లింకులో చూడవచ్చును:
కలడందురు దీనుల ఎడ
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడివాడు కలడో లేడో
యూ ట్యూబ్ వీడియో: శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారి సౌజన్యంతో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి