ఈ శ్లోకం 1967 లో విశ్వశాంతి బ్యానర్ మీద యు.విశ్వేశ్వరరావు నిర్మించి, సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన “కంచుకోట” చిత్రం లోనిది. ఈ చిత్రానికి సంగీతం కె.వి. మహదేవన్ అందించారు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, సావిత్రి, దేవిక, ఉదయకుమార్ ప్రధాన తారాగణం. ఈ శ్లోకం నేపథ్యంలో చిత్రం ఆఖరులో ఎన్.టి.ఆర్. పట్టాభిషేకం సమయంలో చిత్రీకరించారు. ఈ శ్లోకం గుఱించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ మంగళ శ్లోకం ఋగ్వేదం (స్వస్తి సూక్తం) మరియు శ్రీ మద్రామాయణం ఉత్తరకాండ ముగింపులోని మంగళ శ్లోకాల నుండి స్వీకరించబడింది. సాధారణంగా సభలు, పూజలు, యజ్ఞాలు ముగిసేటప్పుడు విశ్వశాంతి కోసం ఈ మంగళ శ్లోకాన్ని పఠిస్తారు. సమస్త ప్రాణికోటికి శుభం కలగాలని, పాలకులందరూ ధర్మబద్ధంగా పాలన అందించాలని, ప్రపంచంలో శాంతి సౌఖ్యాలు వర్ధిల్లాలని కోరుకుంటూ చెప్పే మంగళాశాసనం ఇది. అందుకేనేమో విశ్వేశ్వరరావు గారు తమ బ్యానర్ ను "విశ్వశాంతి" గా ఎన్నుకున్నారు.
| M#000 | S#00 | స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం |
|---|---|---|
| చిత్రం: | కంచుకోట (1967) | |
| మూలం: | సాంప్రదాయక స్వస్తివాచకం | |
| గానం: | ఘంటసాల | |
| సంగీతం: | కె.వి. మహదేవన్ | |
| ఘంటసాల : | స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం | |
| న్యాయేన మార్గేణ మహీం మహీశాః | ||
| గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం | ||
| లోకాః సమస్తాః సుఖినో భవంతు | ||
| ఓం శాంతి శాంతి శాంతిః |
తాత్పర్యం: పాలకులు న్యాయమైన మార్గంలో భూమిని పరిపాలించాలి. ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలి. గోవులకు, బ్రాహ్మణులకు (సమసమాజానికి దిశానిర్దేశం చేసే జ్ఞానులకు) ఎల్లప్పుడూ శుభం కలగాలి. ఈ విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి.
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి