1958 సంవత్సరంలో విడుదలైన శ్రీ రవి ఫిలింస్ సంస్థ నిర్మించిన కొండవీటి దొంగ(డ) చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "సాహసమే జీవిత పూబాటరా" అనే ఈ ఏకగళం రచన అనిసెట్టి, స్వరపరచినది ఎస్.ఎల్.మర్చెంట్, ఎం.ఎస్.శ్రీరామ్. ఈ చిత్రంలో తారాగణం రంజన్, అంజలీదేవి, ఎం.కె. రాధ,టి. ఎన్. బాలయ్య. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు ఎం.ఎ.తిరుముగం.
| #0000 | పాట: | సాహసమే జీవిత పూబాటరా | ||
|---|---|---|---|---|
| పతాకం: | దేవర ఫిలింస్ | |||
| చిత్రం: | కొండవీటి దొంగ (1958) డబ్బింగ్ చిత్రం | |||
| సంగీతం: | ఎస్.ఎల్.మర్చెంట్, ఎం.ఎస్.శ్రీరాం | |||
| రచన: | అనిసెట్టి | |||
| గానం: | ఘంటసాల | |||
| ప. | సాహసమే జీవితపు బాటరా | |||
| సత్యమె నీలక్ష్యమని చాటరా | ||||
| సాహసమే జీవితపు బాటరా, చాటరా | |సాహసమే| | |||
| చ. | కష్టముల పెను తుఫాను కాలమే | |||
| ఎన్నో అరిష్టముల పాలైపోయె దేశమే | ।కష్టముల| | |||
| విడువక ధైర్యం నిత్యం కృషిసల్పరా | |విడువక| | |||
| మనదేశాన ధర్మమునె నెలకొల్పరా | ||||
| సాహసమే జీవితపు బాటరా, చాటరా | |సాహసమే| | |||
| చ. | త్యాగశీలినే ఈ లోకం వరించును | |||
| ధర్మదీక్ష ఏనాడైనా ఫలించును | |త్యాగశీలినే| | |||
| నీతికొరకు ప్రాణాలైన బలిచేయరా | |నీతికొరకు| | |||
| జగాన అభ్యుదయ స్థాపనమె సాధించరా | ||||
| సాహసమే జీవితపు బాటరా | ||||
| సత్యమె నీలక్ష్యమని చాటరా | ||||
| సాహసమే జీవితపు బాటరా, చాటరా |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి