రాగం - సింహేంద్రమధ్యమం
#000 | పద్యం | భక్త శిఖామణి ప్రహ్లాదు |
---|---|---|
నిర్మాణం | శ్రీ సరస్వతీ మూవీస్ | |
చిత్రం: | శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965) | |
కలం: | రాజశ్రీ | |
స్వరం: | టి.వి.రాజు | |
గళం: | ఘంటసాల | |
భక్త శిఖామణి ప్రహ్లాదు కరుణించి | ||
ఆవిర్భవించిన ఆదిదేవ | ||
వరకల్పవల్లివై వసుధలో వెలసిన | ||
రమణీయరూప వరాహవదనా! | ||
దుష్టవిశిక్షణా! శిష్టసంరక్షణా! | ||
ఇంద్రాది వినుత సింహేంద్రమధ్యా! | ||
అణురూప బహురూప అఖిల లోకాధార | ||
వీరమోహన అవతారపురుషా | ||
ఆశ్రయించిన భక్తుల ఆర్తిదీర్చి | ||
పూజచేసెడివారికి ముక్తినిచ్చి | ||
దయతొ కాపాడునట్టి ఓ..ఓ..ద్వయతరూప | ||
సింహగిరివాస వరహనృసింహదేవా..ఆ...ఆ.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి