| చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
| రచన: | సముద్రాల జూనియర్ | |
| సంగీతం: | ఘంటసాల | |
| గానం: | ఘంటసాల |
| ఏ ప్రసాద మహిమ ఇలరాజులాశించు రణరంగ విజయమేరాజనంబు | ||
| ఏ ప్రసాదలవలి భూప్రజాసతికెల్ల ధనధాన్య సౌభాగ్యదాయకంబు | ||
| ఏ ప్రసాదవరమే ఇహలోక జనులకు భవభయ బాధానివారణంబు | ||
| ఏ ప్రసాద గుణమె యెల్లయోగులు కోరు శాశ్వత సాయుజ్య సాధనంబు | ||
| కూర్మి యిల్లాండ్ర పసుపుకుంకుమలు నిలిపి భువిని చిన్నిపాపల చిరాయువుల | ||
| జేసి పరమపాతకునైనా పావనునిజేయు సత్యనారాయణ వరప్రసాదమిదియే | ||
| సత్యనారాయణ వరప్రసాదమిదియే |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి