1956 సంవత్సరంలో
విడుదలైన జూపిటర్ సంస్థ నిర్మించిన ఉమాసుందరి చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఆపదలెన్ని వచ్చిన " అనే ఈ పద్య రచన
సదాశివబ్రహ్మం, స్వరపరచినది అశ్వత్థామ.
ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు,
కన్నాంబ, శ్రీరంజని, రేలంగి, నాగయ్య, పేకేటి.. ఈ చిత్రానికి నిర్మాత
ఎం.సోమసుందరం మరియు దర్శకుడు పి.పుల్లయ్య. దీనిని
ఎన్.టి.ఆర్. పై
చిత్రీకరించారు. ఈ చిత్రం 20.07.1956 న విడుదలైంది.
| చిత్రం: | ఉమా సుందరి (1956) | |
| రచన: | సదాశివబ్రహ్మం | |
| సంగీతం: | జి.అశ్వత్థామ | |
| గానం: | ఘంటసాల |
| ఆపదలెన్ని వచ్చిన గృహంబున తాతల నాటి నుండి నీ | ||
| దీపము నిత్యమై వెలిగె దీనికి యిప్పుడు ముప్పు వచ్చెనే | ||
| నేపగిదిన్ సహింతు పరమేశ్వరా నన్ను క్షమింపవయ్య నీ | ||
| దీపము సన్నగిల్లి కడతేరక ముందెటకేని పోయెదన్! |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి