1956 సంవత్సరంలో
విడుదలైన మహీ సంస్థ నిర్మించిన
శ్రీగౌరీమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాలపి.లీల తో పాడిన
"శివమనోహరి సేవలు" అనే ఈ యుగళం రచన
మల్లాది, స్వరపరచినది ఓగిరాల,
టి.వి.రాజు. ఈ
చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
శ్రీరంజని, కాంతారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు . ఈ చిత్రానికి నిర్మాత
పి.శేషాచలం మరియు దర్శకుడు డి.యోగానంద్.
చిత్రం: | శ్రీగౌరీ మహాత్మ్యం (1957) | ||
రచన: | మల్లాది | ||
గానం: | ఘంటసాల, లీల | ||
సంగీతం: | ఓగిరాల, టి.వి. రాజు | ||
పల్లవి: | లీల: | శివమనోహరీ సేవలు కొనవే దేవీ దీవెనలీవే -2 | |
సీమంతిని నే చేసిన పూజలు -2 | |||
నీ చిరునవ్వులుగా ఫలించే | |||
శివమనోహరీ సేవలు కొనవే దేవీ దీవెనలీవే -2 | |||
చరణం: | లీల: | కలతమాసే కనీరు మాసే | |
ఘం: | మురిపెము చెలువారే | ||
లీల: | కలతమాసే కనీరు మాసే | ||
ఘం: | మురిపెము చెలువారే | ||
లీల: | కలలో పెన్నిధి కన్నపేదకు-2, కలనిజమాయే | ||
ఘం: | నీ వరానా | ||
ఇద్దరు: | శివమనోహరీ సేవలు కొనవే దేవీ దీవెనలీవే -2 | ||
చరణం: | లీల: | ఆలన పాలన చేసీ | |
ఘం: | మము అల్లారు తీరున చూసీ | ||
లీల: | ఆలన పాలన చేసీ | ||
ఘం: | మము అల్లారు తీరున చూసీ | ||
లీల: | ఈ అనురాగమె ఈ పరవశమే | ||
ఇద్దరు: | ఈ అనురాగమె ఈ పరవశమే | ||
శైలబాల స్థిరమై వరదా -2 | |||
దేవీ దీవెనలీవే | |||
శివమనోహరీ సేవలు కొనవే దేవీ దీవెనలీవే -2 | |||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి