ఎన్.టి.ఆర్. నటించిన 1960 చిత్రం దేవాంతకుడు ఒక ఫాంటసీ చిత్రం. ఇందులో హీరో తన పొరుగింటి అమ్మాయి (కృష్ణ కుమారి)ని ప్రేమిస్తాడు. అది నచ్చని ఆమె తండ్రి (ఎస్.వి.ఆర్.) కోపంతో హీరోను హత్య చేయిస్తాడు. హీరోను యమభటులు నరకానికి తీసుకుని వెళతారు. హీరో తన లౌక్యంతో యముడ్ని(ఎస్.వి.ఆర్.) ఒక ఆట ఆడిస్తాడు. తనకు వేరే లోకాలు తిరగాలని వుందని, విష్ణుమూర్తిని చూడడానికి పాస్ పోర్టు ఇమ్మని యముడ్ని అడుగుతాడు. ఈ చిత్రంలో "గో గో గో గో గోంగూర" అప్పటిలో చాల పాపులర్ పాట. చాల హాస్యభరితమైన చిత్రమిది. ఈ కథనే ఎమర్జన్సీ (యమర్జన్సీ) సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్.టి.ఆర్. హీరో గా, జయప్రద హీరోయిన్ గా యమగోల చిత్రం తీసారు. దేవాంతకుడు, యమగోల చిత్రాలకు ఇతివృత్తం ఒకటే, హీరో ఒకరే. తరువాత ఇదే ఇతివృత్తం తో మరికొన్ని యమ కథలు వచ్చాయి. దేవాంతకుడు చిత్రం లో ఘంటసాల ఆలపించిన చక్కని పద్యాలలో పాసు పోర్టు మీద పద్యం ఒకటి. దేవాంతకుడు చిత్రానికి సంగీతం అశ్వత్థామ. గీత రచన ఆరుద్ర.
చిత్రం: | దేవాంతకుడు (1960) | |
కలం: | ఆరుద్ర | |
స్వరం: | అశ్వత్థామ | |
గళం: | ఘంటసాల | |
పద్యం: | అన్ని లోకాలు తిరుగ నా ఆశయమ్ము | |
వ్రాసి యిప్పించుమా చిన్న పాసుపోర్టు | ||
విష్ణుమూర్తిని చూడ నా విధియె మారు | ||
ఆడితప్పకు దయసేయుమట్టి వరము | ||
అట్టి వరము ఆ..ఆ..ఆ…ఆ.. | ||
అన్ని లోకాలు తిరుగ నా ఆశయమ్ము |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి