1956 లో విడుదలైన చిత్రం ఉమా సుందరి. ఈ చిత్రకథలో ఎన్.టి.ఆర్. రాజుగా, శ్రీరంజని రాణిగా నటించారు. వారు శివభక్తులు. ఒకసారి రాజ్యంలో కరువు కాటకాలు సంభవించి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలంతా తిండి, నీరు దొరకక దూరప్రాంతాలకు వలస వెళతారు. రాజు, రాణి, పిల్లలు కూడ అదే మార్గం పడతారు. అయితే దారిలో వారు విడిపోతారు. తనవారు ఏ పులివాతకో బలైపోయుంటారని రాజు చింతిస్తాడు. జీవితప్రయాణంలో అంటా బాటసారులేకదా! సిరిసంపదలు, బంధుమిత్రులు అంతా బూటకమని రాజు వైరాగ్యం వెలిబుచ్చుతాడు. ఆభావాన్ని చక్కని పద్యాలలో మాస్టారు గానం చేసారు ఈ చిత్రంలో. ఆ సమయంలో సాంబశివుడు (నాగభూషణం) ఒక సాధువు వేషంలో రాజు దగ్గరకు వచ్చి వేదాంతం చెప్తాడు. ఎన్.టి.అర్. కు ఘంటసాల, నాగభూశణానికి పిఠాపురం నాగేశ్వర రావు నేపథ్యమిచ్చారు. ఈ చిత్రానికి సంగీతం అశ్వథ్థామ. పద్యరచన సదాశివ బ్రహ్మం.
ఘంటసాల: | తారసిల్లిన బాటసారులంతే కదా, ఆ..ఆ.. | |
ఆలుబిడ్డలు జీవయాత్రలోన..ఆ..ఆ | ||
సిరిసంపదలు కల్ల! మెరుపులంతే కాని | ||
శాశ్వతంబుకావు జగతిలోన..ఆ..ఆ.. | ||
సౌఖ్యంబు సున్న! కష్టతరంగములె కాని | ||
సంసార దుర్భర జలధిలోన..ఆ. | ||
బంధుమిత్రులు చుట్ట పక్కాలు దొంగలు | ||
కాని, కష్టాలలో కానబడరు! | ||
ప్రబల మాయావిమోహ విభ్రాంతమైన | ||
కపట నాటకమింతియెకాని ప్రకృతి మిధ్య! | ||
ప్రేమ బంధాలెల్ల మిధ్య! నవ్వులేడుపులు మిధ్య! | ||
నమ్మరాదీ జగము..ఆ..ఆ.. | ||
ఆ..ఆ..ఆ…ఆ.. | ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి