చిత్రం:
అమరశిల్పి జక్కన్న (1964)
రచన:
సముద్రాల రాఘవాచార్య
సంగీతం:
ఎస్.రాజేశ్వర రావు
గానం:
ఘంటసాల, సుశీల, బృందం
VIDEO
Thanks to Priyanshu Doneparthy for posting the song to You Tube
సాకీ:
ఘంటసాల:
శ్రీ వేణుగోపాలా..ఆ.. చిన్మయానంద
లీలా
నారాయణ విజయనారాయణ నారాయణా పాహీ..ఈ..
పల్లవి:
ఘంటసాల:
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా.. -2
తనువూ, మనసూ తరియించె ఈ వేళా..
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా..
చరణం:
ఘంటసాల:
ఎండిపోయిన గుండెలలోన పండువెన్నెల చిలికితివీవు
సుశీల:
తోడునీడగ మా దరినిలిచి కావుమా, కరుణాజలధి
ఇద్దరు:
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా..
శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా!
బృందం:
శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా!
ఇద్దరు:
నాట్యకళా మోహనా, సకలలోక పావనా
బృందం:
నాట్యకళా మోహనా, సకలలోక పావనా
శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా! -2
ఇద్దరు:
నీవే తల్లివి తండ్రివి మాకు జీవనదాతవు నీవె ప్రభూ!
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఇద్దరు:
నీదు సేవయే జీవనరక్ష, నీదు సన్నిధే పెన్నిధిరా
బృందం:
ఒ ఓ..ఓ..ఓ ఓ ఓ
ఇద్దరు:
నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా
బృందం:
నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా
ఇద్దరు:
నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా
ఘంటసాల:
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా - 2
ఘంటసాల-బృందం:
చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా
చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా
ఘంటసాల:
కేశవా…నా…. తరమా… వరదా..
కొనియాడ నీ లీలా… కేశవా..
బృందం:
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా - 4
https://www.youtube.com/watch?v=fcW6n8VoxWI&feature=youtu.be
రిప్లయితొలగించండిWhere can I find songs from Bhale Ramudu in your blog?
రిప్లయితొలగించండిMohan Devaraju
dvmohan@msn.com