బ్రహ్మచారి మనసులో ఎలాంటి రసమయ భావాలున్నాయో తెలుసుకోవాలంటే అవి తన కలలకు ప్రతిరూపమైన కన్నెపిల్ల ఎదటపడినపుడు తమంత తామే ఆ భావాలు గుండెలోతుల్లోంచి పెల్లుబికి బయటపడతాయి. ఇరువురి చూపులు కలసిన వేళ కలిగిన పరస్పర రసస్పందనలు ఆ అబ్బాయి మనసును కవితామయం చేసి ఆ అమ్మాయి కులుకుల నడకలను, వలపుల తలపులను, నగవుల సొగసులను వర్ణిస్తూ అనురాగాన్ని ప్రస్ఫుటింపజేస్తాయి. 1952 లో విడుదలైన ఎన్.టి.ఆర్., సావిత్రి జంటగా నటించిన పల్లెటూరు చిత్రానికి సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు వ్రాసిన ఆ మనసులోన అన్న పాటను మాస్టారు అభుతమైన బాణీ కట్టి అంతకంటె మనోహరంగా పాడారు. ఈ సన్నివేశంలో ఎన్.టి.ఆర్, సావిత్రిల నటన అపూర్వం.
చిత్రం: | పల్లెటూరు (1952) | ||
రచన: | సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు | ||
సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
సాకీ: | ఆ మనసులోన, ఆ చూపులోన | ||
హు.హు.హు.. | |||
పల్లవి: | ఆ మనసులోన ఆ చూపులోన | ||
పరుగులెత్తే మృదుల భావనా మాలికల | |||
అర్థమేమిటొ తెల్పుమా, ఆశయేమిటొ చెప్పుమా | |||
చరణం: | ఆ నడకలోన, ఆ నడకలోన | ||
దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు | |||
అంతరార్థము తెల్పుమా, ఆశయము వివరింపుమా | |||
చరణం: | ఆ కులుకులోన, ఆ పలుకులోన | ||
పెనవేసికొనియున్న, వెలికిరాలేకున్న-2 | |||
తలపులేమో తెల్పుమా | |||
వలపులేవో చెప్పుమా -2 | |||
చరణం: | ఆ సొగసులోన, ఆ నగవులోన | ||
తొగరువా తెరగప్పి చిగురించు కోరికల..ఆ..ఆ.. | |||
తొగరువా తెరగప్పి చిగురించు కోరికల | |||
మరుగదేమిటొ తెల్పుమా | |||
తెరగదేమిటొ చెప్పుమా | |||
చరణం: | ఆ... హృదిలో, ఈ... మదిలో | ||
పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని -2 | |||
పరిమళించునె తెల్పుమా | |||
ఫలితమిత్తునె చెప్పుమా -2 | |||
ఆ…మనసులోనా |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి