అమృతం కోసం కోలాహలంగా దేవ-దానవులు క్ష్రీరసాగర మథనం జరిపినపుడు ముందు హాలాహలం పుట్టింది. దాని భీకరజ్వాలను ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. అందరూ కలసి భూతనాథుని వేడుకున్నారు. పరమశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగి గళమున బంధించి నీలకంఠుడై మూర్ఛిల్లాడు. శివుని జాగృతికి తేవడానికి అభిషేకాలు, పూజలు చేసి అందరూ జాగరణ చేశారు. ఈ రాత్రే శివరాత్రి. శివుడు పంచ వక్త్రుడు. రుద్రస్వరూపుడు. శివునికి ద్వాదశ జ్యోతిర్లింగాలున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఉత్తర భారత దేశంలో ఉన్నాయి. జ్యోతిర్లింగాలలో ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ఒకటి. శివలింగాలు పంచభూతాల రూపంలో పృథ్వి, జల, వాయు, ఆకాశ, తేజో లింగాలు - అవి పృథ్వీ లింగం (కంచి), జల లింగం (జంబుకేశ్వరం), వాయు లింగం (శ్రీకాళహస్తి), ఆకాశ లింగం (చిదంబరం), తేజో లింగం (అన్నామలై) గా ఆయా శివ క్షేత్రాలలో వెలసాయి. అలాగే శివునికి పంచ ఆరామములు గల ఐదు పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో వున్నాయి. అవి అమరారామము (అమరావతి, గుంటూరు), ద్రాక్షారామము (ద్రాక్షారామం, తూర్పు గోదావరి), కుమారారామము (సామర్లకోట), భీమారామము (భీమవరం), క్షీరారామము (పాలకొల్లు). ఈ శివక్షేత్రాలలోని కొన్నింటిని 1968 లో విడుదలయిన 'దేవకన్య' చిత్రం కోసం "ఈశా గిరీశా మహేశా!" పాటలో చక్కగా వర్ణించారు అలనాటి ప్రముఖ రచయిత వీటూరి. ఈ చిత్రానికి సంగీతం టి.వి.రాజు. గానం ఘంటసాల. ఈ శివరాత్రికి శివుని ప్రార్థించే ఈ గీతం యొక్క దృశ్య, శ్రవణ ఖండికలను విని చూసి ఆనందించండి.
Thanks: To TeluguOne for up loading the video to You Tube and Wikipedia for the useful information and to Ghantasala Galamrutamu blog for the background information.
శివరాత్రి శుభాకాంక్షలు!
చిత్రం: | దేవ కన్య (1968) | ||
రచన: | వీటూరి | ||
గానం: | ఘంటసాల | ||
సంగీతం: | టి.వి.రాజు | ||
పల్లవి: | ఈశా గిరీశా మహేశా! | ||
జయ కామేశ కైలాస వాసా! | | ఈశా | | ||
ఈశా గిరీశా మహేశా! | |||
చరణం: | గంగా తరంగాల కలుషాలు మాపే | ||
కాశీ పురాధీశ విశ్వేశ్వరా! | | కాశీ | | ||
మోక్షద్వారము దాక్షారామము | |||
భవభయదూరా భీమేశ్వరా! | | భవ | | ||
చరణం: | భక్తవశంకర భ్రమరాంబికావర | ||
శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా! | | శ్రీకర | | ||
వాయులింగా స్మరదర్పభంగా | |||
ధవళాంగ శ్రీకాళ హస్తీశ్వరా! | |ధవళాంగ | | ||
చరణం: | కాంచీపురీవర ఏకాంబరేశ్వర | ||
కామేశ్వరీ వామభాగేశ్వరా! | |||
శ్రీ సుందరేశ మీనాక్షీ మనోజ | |||
నమో! చిదంబర నటరాజా! | | నమో | | ||
చరణం: | కరుణేందు శేఖర అరుణాచలేశ్వర | ||
సాకార ఓంకార అమలేశ్వరా | |||
శ్రితజన మందార కేదారేశ్వరా! | |||
రామ ప్రతిష్టిత సైకతలింగా ఆ..ఆ.. | |||
రమ్య శుభాంగా రామలింగా | | రమ్య | | ||
శ్రీ రామలింగా ఆ రామలింగా -3 |
Thanks: To TeluguOne for up loading the video to You Tube and Wikipedia for the useful information and to Ghantasala Galamrutamu blog for the background information.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి