అమ్మ వొడి నుండి బడికి అడుగిడిన బుడతలకు పలుకు తెలియని ప్రాయంలో పలకా, బలపం పట్టించి ఓనమాలు దిద్దించిన ఒజ్జ మన పూజ్య గురువు. తొలిదశలో మాస్టారంటే భయము, భక్తి ఉన్నా, కాల క్రమేణా ఒక అవ్యాజమైన అనుబంధం పెనవేసుకుంటుంది. తొలి గురువు తల్లి, తదుపరి తండ్రి ప్రాధమికంగా జ్ఞాన బీజం నాటినప్పటికీ, ఇల్లు దాటినాక, నిజ జీవితానికి, భవిష్యత్తుకు పునాది వేసేది పాఠశాల లో విద్య చెప్పే గురువు. ఆ గురువే త్రిమూర్తి స్వరూపుడు. జ్ఞానాన్ని సృజియించే గురువు బ్రహ్మగా, సముపార్జించిన విజ్ఞాన సంపదను స్థిర పరిచే గురువు విష్ణువుగా, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే గురువు శివునిగా వెరసి త్రిమూర్తి స్వరూపుడు. ప్రతి పాఠశాలలోను సహజీవన, సమభావన, సమతావాదాన్ని తెలిపే భారత మాతను ప్రస్తుతించే దినం స్వాతంత్ర్య దినోత్సవం. శాంతి దూత బాపూజీ, జాతి రత్నమైన నెహ్రూ మొదలయిన ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, విప్లవ వీరులు, వీరమాతల త్యాగ నిరతికి ఫలితంగా మనకు స్వతంత్ర్యం వచ్చింది. ఆ శుభదినాన భరత మాతకు నివాళులర్పిద్దాం. స్కూలు మాస్టారు గా బడిపంతులు (1972) చిత్రంలో అద్భుతమైన నటన చూపిన నందమూరి తారక రామారావు నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్. మాస్టారు, బృందం పాడిన ఈ చక్కని పాటను రచించినది ఆచార్య ఆత్రేయ.
Thanks to Nandamuri Leela Arjuna Teja for providing the You Tube song.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
| పల్లవి: | టీచర్: | భారత మాతకు జేజేలు! బంగరు భూమికి జేజేలు! | |
| పిల్లలు: | భారత మాతకు జేజేలు! బంగరు భూమికి జేజేలు! | ||
| టీచర్: | ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవ ధాత్రికి జేజేలు! | ||
| పిల్లలు: | ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవ ధాత్రికి జేజేలు! | ||
| అందరు: | భారత మాతకు జేజేలు! బంగరు భూమికి జేజేలు! | ||
| టీచర్: | ఆ.ఆ.ఆ.ఆ. ఆ.ఆ.ఆ. ఆ.ఆ. | ||
| పిల్లలు: | ఆ.ఆ.ఆ.ఆ. ఆ.ఆ.ఆ. ఆ.ఆ. | ||
| చరణం: | టీచర్: | త్రివేణి సంగమ పవిత్ర భూమి | |
| నాల్గు వేదములు పుట్టిన భూమి | |||
| గీతామృతమును పంచిన భూమి | |||
| పంచశీల బోధించిన భూమి | |||
| పిల్లలు: | పంచశీల బోధించిన భూమి | ||
| అందరు: | భారత మాతకు జేజేలు! బంగరు భూమికి జేజేలు! | ||
| చరణం: | టీచర్: | శాంతిదూతగా వెలసిన బాపూ.. | |
| జాతి రత్నమై వెలిగిన నెహ్రూ | |||
| పిల్లలు: | శాంతిదూతగా వెలసిన బాపూ | ||
| జాతి రత్నమై వెలిగిన నెహ్రూ | |||
| టీచర్: | విప్లవ వీరులు వీర మాతలు | ||
| పిల్లలు: | విప్లవ వీరులు వీర మాతలు | ||
| టీచర్: | ముద్దు బిడ్డలై మురిసే భూమి | ||
| అందరు: | భారత మాతకు జేజేలు! బంగరు భూమికి జేజేలు! | ||
| చరణం: | టీచర్: | సహ జీవనము, సమ భావనము | |
| సమతా వాదము వేదముగా | |||
| ప్రజా క్షేమము ప్రగతి మార్గము | |||
| లక్ష్యములైన విలక్షణ భూమి | |||
| పిల్లలు: | లక్ష్యములైన విలక్షణ భూమి | ||
| అందరు: | భారత మాతకు జేజేలు! బంగరు భూమికి జేజేలు! | ||
| ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవ ధాత్రికి జేజేలు! | |||
| టీచర్: | ఆ.ఆ.ఆ.ఆ. ఆ.ఆ.ఆ. ఆ.ఆ. | ||
| పిల్లలు: | ఆ.ఆ.ఆ.ఆ. ఆ.ఆ.ఆ. ఆ.ఆ. | ||
| టీచర్: | ఆ.ఆ.ఆ.ఆ. ఆ.ఆ.ఆ. ఆ.ఆ. | ||
| పిల్లలు: | ఆ.ఆ.ఆ.ఆ. ఆ.ఆ.ఆ. ఆ.ఆ. | ||


Thanks for a inspiring song for 15th August.
రిప్లయితొలగించండిgood work sir
రిప్లయితొలగించండిgood work sir
రిప్లయితొలగించండి