భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి లేదా గణేశ చతుర్థి గా మనం జరుపుకుంటాము. వినాయకుడు ఆది పూజ్యుడు. ఏ కార్యం తలపెట్టినా అది నిర్విఘ్నంగా జరగడానికి విఘ్న వినాశకుడైన వినాయకుని స్తుతిస్తాము. ఘంటసాల మాస్టారు ఎందఱో దేవుళ్ళ పై భక్తీ గీతాలు, పద్యాలు ఆలపించారు చలన చిత్రాలలో. అందులో వినాయకుని పై ప్రత్యేకంగా వారి స్వీయ సంగీత దర్సకత్వంలో వచ్చిన వినాయక చవితి చిత్రం లో "శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం" శ్లోకము, "జయ గణనాయక విఘ్న వినాశక" పాట మరియు "తొండము నేక దంతము" పద్యం, హంసధ్వని రాగం లో శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కూర్చిన "వాతాపి గణపతిం భజే" చెప్పుకోదగినవి. మాస్టారు పాడిన ప్రైవేట్ భక్తి గీతాలలో శ్రీ ఎ.వేణుగోపాల్ రచించిన "పూజలన్దవయ్యా గణేశ పుడమిని కలత బాపవయ్యా" ప్రత్యేకంగా వినాయక చవితి పండగకు బృందం తో కలసి పాడినది. ఈ వినాయక చవితికి దానిని మీకు సమర్పిస్తున్నాను. విని ఆనందించండి.
గణేశుని పూజలో వాడే ఏకవింశతి పత్రి |
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
రచన: వేణు; సంగీతం: ఘంటసాల; గానం: ఘంటసాల, బృందం.
ఘంటసాల: (వచనం) సర్వకార్యములు నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఆది పూజ్యుడైన గణనాథుని చవితి పండుగనాడు ప్రజలందరూ వేడుకుంటున్నారు
ప. ఘంటసాల: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
బృందం: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
ఘంటసాల: పార్వతి తనయా పాపవిభంజన
పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య
బృందం: పార్వతి తనయా పాపవిభంజన
పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య
బృందం: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
చ. ఘంటసాల: జగములనేలెడి జగజ్జెట్టివిరా
బృందం: జగములనేలెడి జగజ్జెట్టివిరా
ఘంటసాల: వినుతి సేతుముర మూషికవాహన
బృందం: వినుతి సేతుముర మూషికవాహన
ఘంటసాల: కుడుములు, ఉండ్రాళ్ళు విందు సేతుముర
ఇడుముల బాపి శుభములొసగరా!
బృందం: కుడుములు, ఉండ్రాళ్ళు విందు సేతుముర
ఇడుముల బాపి శుభములొసగరా!
ఘంటసాల: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
బృందం: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
చ. ఘంటసాల: భక్తపోషకా సురగణ నాయక
బృందం: భక్తపోషకా సురగణ నాయక
ఘంటసాల: శక్తినొసగరా సిద్ధి వినాయక
బృందం: శక్తినొసగరా సిద్ధి వినాయక
ఘంటసాల: వరములిచ్చి కరుణించి దీవించు
దొరవీవేరా మమ్ము బ్రోవరా
బృందం: వరములిచ్చి కరుణించి దీవించు
దొరవీవేరా మమ్ము బ్రోవరా
ఘంటసాల: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
బృందం: పూజలందవయ్యా గణేశా
పుడమిని కలత బాపవయ్యా
ఘంటసాల: పార్వతి తనయా పాపవిభంజన
పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య
బృందం: పార్వతి తనయా పాపవిభంజన
పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య
ఘంటసాల: జై! గణనాథ, హే! గణనాథ
బృందం: జై! గణనాథ, హే! గణనాథ
బృందం: జై! గణనాథ, హే! గణనాథ
జై! గణనాథ, హే! గణనాథ
వినాయక చవితి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీకు కూడ వినాయక చవితి శుభాకాంక్షలు.
తొలగించండిmee dharmama ani yentha manchi paata vinnanu swami. ghantasala mastari vaari amaraganam hridayapoorvaka dhanyavaadalu sweekarinchandi. aa gananadhuni aaseessulu meeku yellappudu vundugaaka.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు, ధన్యవాదములు.
తొలగించండిVery timely song.May Lord Ganesha bless u Sir!!
రిప్లయితొలగించండి